Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర కోసం స్టార్ హీరోకి స్పెషల్ క్రికెట్ కోచింగ్

బయోపిక్ అనేది ఇప్పుడు ఒక సక్సెస్ సూత్రంగా మారింది. చరిత్రలో ఒక పేజీని తెరపై అందంగా ఆవిష్కరిస్తే గుర్తింపుతో పాటు సినిమా వాళ్లకు కాసుల వర్షం బోనస్. ఇక ఒక పుస్తకం లాంటి చరిత్రనే స్క్రీన్ పైకి తేవాలంటే చాలా కష్టమైనా పని. కపిల్ దేవ్ జీవితాన్ని ప్రధానంగా చేసుకొని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కబీర్ ఖాన్ 1983 వరల్డ్ కప్ పై మూవీ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 

83 movie ranveer latest news
Author
Hyderabad, First Published Feb 7, 2019, 4:17 PM IST

బయోపిక్ అనేది ఇప్పుడు ఒక సక్సెస్ సూత్రంగా మారింది. చరిత్రలో ఒక పేజీని తెరపై అందంగా ఆవిష్కరిస్తే గుర్తింపుతో పాటు సినిమా వాళ్లకు కాసుల వర్షం బోనస్. ఇక ఒక పుస్తకం లాంటి చరిత్రనే స్క్రీన్ పైకి తేవాలంటే చాలా కష్టమైనా పని. కపిల్ దేవ్ జీవితాన్ని ప్రధానంగా చేసుకొని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కబీర్ ఖాన్ 1983 వరల్డ్ కప్ పై మూవీ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 

83 సినిమాలో ప్రతిసన్నివేశం ఒళ్ళు దగ్గరపెట్టుకొని చేయాలి. ఎందుకంటే 1983లో భారత క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. సన్నివేశాలు రియలిస్టిక్ గా ఉండాలని నిజమైన లార్డ్స్ మైదానంలోనే సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే మెయిన్ గా బౌలింగ్ విషయంలో కపిల్ తరహాలో రణ్ వీర్ కనిపిస్తాడని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది. 

కపిల్ దేవ్ హావభావాలను చూసి ఈ స్టార్ హీరో తనకు తాను 83 కపిల్ గా మార్చుకుంటున్నాడట. ఫిగర్ కరెక్ట్ గా స్క్రీన్ పై కనిపించేవరకు కపిల్ నుంచి పరీక్షలు ఆగవని చెబుతున్నాడు. కొన్ని వరాల నుంచి కపిల్ దగ్గరే కోచింగ్ తీయూస్కుంటున్న రణ్ వీర్ ఆయన చెప్పినట్లు నిరంతరంగా ఒక ఓవర్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 

ఆ నాటి వరల్డ్ కప్ ని కూడా రణ్ వీర్ తదేకంగా ఎప్పటికప్పుడు మొబైల్ లో చూస్తూ అలవాటు చేసుకుంటున్నాడట. మరి అతని ఏకాగ్రత ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే సినిమా టీజరి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios