మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. బన్నీ, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే బన్నీకి జోడిగా నటిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే థియేటర్స్ లో పంచ్ డైలాగులు పేలాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ లో త్రివిక్రమ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచిన తర్వాత బన్నీ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. 

రెచ్చిపోయిన 49ఏళ్ల యాంకర్.. టాప్ లెస్ ఫోజులతో ఏందీ రచ్చ!

ఇక అల వైకుంఠపురములో చిత్ర సందడి పాటలతోనే మొదలైపోయింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగుల్లో ఎంత డెప్త్ ఉంటుందో అయన ప్రసంగాల్లో కూడా అంతే భావం ఉంటుంది. అందుకే త్రివిక్రమ్ టాలీవడ్ దర్శకులలో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 

మహేష్ కోసం వెంటపడి మరీ.. సినిమాల్లో ఆమె లేడీ సింగం!

ఇటీవల తివిక్రమ్ క్రేజ్ మరో లెవల్ కు చేరినట్లు అనిపిస్తోంది. సహజంగా సినిమాలు విడుదలయ్యే సమయంలో థియేటర్స్ వద్ద స్టార్ హీరోలకు మాత్రమే అభిమానులు కటౌట్ లు ఏర్పాటు చేస్తారు. తాజాగా ఓ థియేటర్ వద్ద అల్లు అర్జున్ కటౌట్ తో పాటు అభిమానులు త్రివిక్రమ్ కటౌట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ పిక్ ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

టాలీవుడ్ డైరెక్టర్ పై చెస్ ఛాంపియన్ హారిక కామెంట్స్!