మహేష్ కోసం వెంటపడి మరీ.. సినిమాల్లో ఆమె లేడీ సింగం!

First Published 3, Jan 2020, 5:21 PM

లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ ఇలా అభిమానులు విజయశాంతిని ముద్దుగా పిలుచుకుంటారు. గ్లామర్ చిత్రాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సక్సెస్ సాధించడం.. స్టార్ హీరోలకు దీటుగా ఎదగడం ఆషామాషీ విషయం కాదు. ఆ ఘనత విజయశాంతికి మాత్రమే దక్కింది. 1980 సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయశాంతి టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించింది. రాజకీయాల్లో కూడా విజయశాంతితనదైన ముద్ర వేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా విజయశాంతి కెరీర్ లో కీలకమైన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలని, సరిలేరు నీకెవ్వరు మూవీపై నెలకొన్న అంచనాలని పరిశీలిద్దాం.. 

ప్రతిఘటన: విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు రావడంతో మొదటి అడుగు పడింది ప్రతిఘటన చిత్రంతోనే అని చెప్పొచ్చు. టి. కృష్ణ దర్శకత్వంలో 1985లో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

కర్తవ్యం : విజయశాంతి తన కెరీర్ లో ఎన్ని గ్లామర్ రోల్స్ చేసినా, ఎన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించినా మొదట గుర్తుకు వచ్చేది కర్తవ్యం చిత్రం మాత్రమే. కర్తవ్యం చిత్రంతో విజయశాంతి ఏకంగా జాతీయ అవార్డు కైవసం చేసుకుంది.  ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా విజయశాంతి నటవిశ్వరూపం ప్రదర్శించింది.

ఒసేయ్ రాములమ్మ : విజయశాంతి కీర్తి కిరీటంలో ఒసేయ్ రాములమ్మ చిత్రం మరో కలికితురాయిగా నిలిచింది. దాసరి నారాయణరావు దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయశాంతి రెబల్ లేడీగా అద్భుతమైన నటన కనబరిచింది.

శాంభవి ఐపీఎస్ : విజయశాంతి మరోసారి పోలీస్ అధికారిగా నటించిన చిత్రం శాంభవి ఐపీఎస్. ఈ చిత్రం కూడా పర్వాలేదనిపించింది.

అడవి చుక్క: విజయశాంతి మరోసారి రెబల్ లేడీగా నటించిన చిత్రం అడవి చుక్క.

భారతరత్న: విజయశాంతి పోలీస్ అధికారిగా మాత్రమే కాదు.. ఈ చిత్రంలో ఆర్మీ అధికారిగా కూడా పవర్ ఫుల్ రోల్ లో నటించింది.

వైజయంతి : కేఎస్ నాగేశ్వర రావు దర్శత్వంలో తెరకెక్కిన వైజయంతి చిత్రంలో కూడా పవర్ ఫుల్ రోల్ లో నటించింది.

సాహసబాలుడు విచిత్ర కోతి  : విజయశాంతి కెరీర్ లో ఇది ఒక డిఫెరెంట్ మూవీ. చిన్నపిల్లాడు, ఓ కోతి చుట్టూ ఈ చిత్రం సాగుతుంది.

నాయుడమ్మ : విజయశాంతి చివరగా నటించిన చిత్రం ఇదే. 2006లో ఈ చిత్రం విడుదలయ్యాక విజయశాంతి వెండి తెరకు దూరమయ్యారు.

విజయశాంతి రీఎంట్రీ: త్వరలో సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంలో విజయశాంతి రీఎంట్రీ గురించి ఒకసారి చర్చించుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయశాంతి కలసి దాదాపు 30 ఏళ్ల క్రితం కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో తల్లీ కొడుకులుగా నటించారు.

సస్పెన్స్: కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన విజయశాంతి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ప్రొఫెసర్ భారతిగా కనిపించబోతోంది. మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్, విజయశాంతి పాత్రల మధ్య సంబంధం ఏంటి.. దర్శకుడు ఎలాంటి కథ సిద్ధం చేశాడు అనేది జనవరి 11 వరకు సస్పెన్సే.

భారీ అంచనాలు: నాయుడమ్మ చిత్రం తర్వాత విజయశాంతి పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు. ఇన్నేళ్లకు ఆమె వెండితెరపై కనిపించనుండడంతో ఈ చిత్రంపై ఒక రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి.

ప్రతి సీన్ కు విజిల్స్: ఈ చిత్రంలో మహేష్, విజయశాంతి కనిపించే ప్రతి సన్నివేశానికి అభిమానులు విజిల్స్ కొడతారని ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. విజయశాంతి క్రేజ్ తెలిసిన అనిల్ రావిపూడి ఆమెని ఈ చిత్రానికి వెంటపడి మరీ ఒప్పించాడు.