బాబీ (కేఎస్ రవీంద్ర) టాలీవుడ్ లో ప్రతిభగల యువ దర్శకులలో ఒకరు. పవర్ చిత్రంతో బాబీ దర్శకుడిగా మారదు. సర్దార్ చిత్రంతో పరాజయం ఎదుర్కొన్నప్పటికీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన జై లవకుశ చిత్రం మంచి విజయం సాధించింది. బాబీ చివరగా తెరకెక్కించిన చిత్రం వెంకీ మామ. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటించిన ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని బాబీ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా చిత్రీకరించాడు. ఈ చిత్రానికి మంచి వసూళ్లే దక్కాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ ట్వీట్ చేసింది. డిసెంబర్ లో విడుదలైన చిత్రాల్లో వెంకీమామ చిత్రం అత్యధిక గ్రాస్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

ఈ పోస్ట్ పై చెస్ ఛాంపియన్ హారిక ద్రోణవల్లి స్పందించింది. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది బావ అని హారిక ట్వీట్ చేసింది. దీనితో బాబీ కూడా హరికకు కృతజ్ఞతలు తెలిపాడు. హారిక సోదరి అనూషని బాబీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హారిక చెస్ ప్లేయర్ గా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు అందుకుంది. 

మామ అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. వెంకటేష్, నాగ చైతన్య మధ్య ఎమోషనల్ సీన్స్.. హీరోయిన్ల గ్లామర్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి.