Asianet News TeluguAsianet News Telugu

Anchor Rashmi: లెస్బియన్ గా మారిన యాంకర్ రష్మి..!

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ దర్శకనిర్మాతల కళ్లల్లో పడే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీకి వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చిందని 
తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో డిజిటల్ హవా పెరగడంతో వెబ్ సిరీస్ కి ఆదరణ బాగా పెరుగుతోంది.

Rashmi Gautham Turns Lesbian
Author
Hyderabad, First Published Nov 13, 2019, 11:42 AM IST

ప్రముఖ టీవీ యాంకర్ రష్మి 'జబర్దస్త్' షోతో బాగా పాపులర్ అయింది. బుల్లితెరపై వరుస టీవీ షోలు చేస్తూ బిజీ యాంకర్ గా మారింది. అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తుంటుంది. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

'గుంటూర్ టాకీస్' సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంతో ఆ తరువాత రష్మికి హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చాయి. ఈ బ్యూటీకి వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పుకుంటూ సినిమాలు చేసింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఏదీ వర్కవుట్ కాలేదు. దీంతో ఆమెకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.

విరాటపర్వం: డైరెక్టర్ కి, కెమెరామెన్ కి గొడవ..?

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ దర్శకనిర్మాతల కళ్లల్లో పడే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీకి వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చిందని  తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో డిజిటల్ హవా పెరగడంతో వెబ్ సిరీస్ కి ఆదరణ బాగా పెరుగుతోంది. అగ్ర తారలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

టాలీవుడ్ లో కూడా సమంత లాంటి స్టార్లు వెబ్ సిరీస్ పై ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు రష్మి కూడా ఓ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. పాత్ర ప్రకారం 
వెబ్ సిరీస్ లో రష్మి లెస్బియన్ గా నటించబోతుందట.

ఇందులో కొన్ని హాట్ సెక్స్ సీన్స్ లో రష్మి కనిపిస్తుందని చెబుతున్నారు. రష్మికి అలాంటి రోల్స్ లో నటించడం కొత్తేమీ కాదు.. 'గుంటూర్ టాకీస్' సినిమాలో ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ ని అంత తేలికగా మర్చిపోలేం. ఇప్పుడు మరోసారి వెబ్ సిరీస్ కోసం హాట్ సీన్స్ లో నటించడానికి సిద్ధమవుతోంది. 

అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందిస్తున్న ఈ వెబ్ సీరీస్ లో  రష్మీ గౌతమ్ లవ్ మేకింగ్ సీన్స్ నిడివి సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఉంటుందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ వెబ్ సీరిస్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ రొమాంటిక్ సీన్స్ ఉంటాయట.  ‘ఏ ఫిలిం బై అరవింద్’ ఫేమ్ శేఖర్ సూరి ఈ సీరీస్ కి డైరెక్టర్ తన టెక్నికల్ టాలెంట్ ని ఉపయోగించి అదరకొట్టనున్నారట. ఈ సీరీస్ లో రష్మీకి లెస్బియన్ పార్ట్నర్ పాత్రలో ఓ ముంబై నటి కనిపించనున్నారని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios