సినిమా రూపొందడానికి నటీనటులతో పాటు సాంకేతిక వర్గం కూడా ఎంతో కృషి చేస్తుంది. ఈ ప్రాసెస్ లో డైరెక్టర్.. కెమెరామెన్ తో కలిసి ఎక్కువ పని చేయాల్సివుంటుంది. దర్శకుడి విజన్ ని కెమెరామెన్ బంధించాల్సివుంటుంది. అలాంటి వీరిద్దరికీ వేవ్ లెంగ్త్ కలవకపోతే అది సినిమాకి పెద్ద సమస్యనే చెప్పాలి. 'విరాటపర్వం' సినిమా విషయంలో అదే జరుగుతోందని ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి.

'విరాటపర్వం' సినిమాకి వేణు ఊడుగుల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో మేకర్లకు ఎలాంటి సమస్య లేదు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తోన్న దివాకర్ మణితో దర్శకుడికి పొసగడం లేదని సమాచారం.

నమ్రత రికమండేషన్ మెహర్ రమేష్ కి జాక్ పాట్!

దివాకర్ మణి ఇండస్ట్రీ పేరున్న వ్యక్తి. తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలకు పని చేశారు. ఆ కారణంగానే అతడిని ఏరి కోరీ మరీ ఈ సినిమా కోసం తీసుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్టర్ వేణుకి, దివాకర్ మణికి అసలు పడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ నుండి దివాకర్ మణిని తప్పించి ఆయన స్థానంలో రాజు తోటని తెచ్చుకోవాలని వేణు ఊడుగుల ప్లాన్ చేస్తున్నాడు.

రాజు తోట, వేణు ఊడుగుల గతంలో 'నీదీ నాదీ ఒకే కథ' అనే సినిమాకి పని చేశారు. తనతో భావజాలం కుదిరిన రాజు తోట అయితే బెటర్ అని వేణు ఊడుగుల భావిస్తున్నాడు. ఈ వ్యవహారం రానా వరకు వెళ్లిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెట్టాలని.. తాను డిసెంబర్ లో సెట్ మీదకు వచ్చిన తరువాత ఈ విషయంలో ఓ నిర్ణయం  తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయింది. ఈ సమయంలో సినిమాటోగ్రాఫర్ ని తప్పించి మరొకరిని తీసుకోవడమంటే అవుట్ పుట్ విషయంలో తేడాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. దివాకర్ మణి వర్క్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అందరి దర్శకులకు అతడు సెట్ అవ్వడని అంటుంటారు. కానీ సుదీర్ వర్మ లాంటి దర్శకుడు అతడితో రెండు రెండు సినిమాలు చేశారు. మరి వేణు ఊడుగులతో సమస్య ఎందుకు వచ్చిందో!