Asianet News TeluguAsianet News Telugu

ప్రాజెక్ట్ సెట్ అయ్యింది: వెంకీ వద్దంటే... ర‌వితేజ‌ రమ్మన్నాడు

ఇండస్ట్రీ ఈ రోజు అనుకున్న మాట రేపు ఉండదు. ప్రతీ శుక్రవారం సీన్ మారిపోతూంటుంది. పాత వాళ్లు ప్రక్కకు వెళ్తే, కొత్తవాళ్లు హాట్ టాపిక్ లు గా మారిపోతూంటారు.

Nakkina Trinadh Rao next with Ravi Teja
Author
Hyderabad, First Published Feb 26, 2020, 8:29 PM IST

ఇండస్ట్రీ ఈ రోజు అనుకున్న మాట రేపు ఉండదు. ప్రతీ శుక్రవారం సీన్ మారిపోతూంటుంది. పాత వాళ్లు ప్రక్కకు వెళ్తే, కొత్తవాళ్లు హాట్ టాపిక్ లు గా మారిపోతూంటారు. అలాగే రీసెంట్ గా ‘వెంకీ మామ’ సినిమాతో  సందడి సందడి చేసిన వెంకటేష్ ఆ తర్వాత వెంకీ ఏం చేయబోతున్నారు? అంటే.. ‘సినిమా చూపిస్త మామ’ ఫేమ్‌ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లిందని సమాచారం.

చాలా కాలంగా ఆ స్క్రిప్టుపై  వర్క్ చేశాడు త్రినాథ‌రావు. అయినా సురేష్ బాబుని మెప్పించలేకపోయాడు. హలో గురు ప్రేమ కోసమే డిజాస్టర్ తర్వాత ...నక్కిన త్రినాధరావు చెప్పేవేమీ సురేష్ బాబుకు నచ్చటం లేదట. దాంతో  ఆ ప్రాజెక్టు  అక్కడ వ‌ర్క‌వుట్ కాదని అర్దం చేసుకుని... ఆ క‌థ ప‌ట్టుకుని చాలా మంది ద‌గ్గ‌ర‌కు తిరిగాడు. కానీ ఫలితం లేక‌పోయింది. చివరకు ర‌వితేజ‌తో త్రినాథ‌రావు సినిమా ఖ‌రారైంది.

ఈ సినిమాను ఏప్రియల్ లో సెట్స్‌ మీదకు తీసుకెళ్తారని సమాచారం. నాన్‌స్టాప్‌ సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని చిత్రం టీమ్ ప్లాన్‌ చేస్తోంది. ఇది  ఓ పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ అని సమాచారం. సినిమా చూపిస్త మావా, నేను లోక‌ల్, హ‌లో గురు ప్రేమ కోస‌మే... సినిమాల‌ తరహాలోనే ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీగా తెరకెక్కనుంది.

అలాగేఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించ‌నుంది. ఇప్ప‌టికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. అటు ర‌వితేజ కూడా పూర్తి స్క్రిప్టు విని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసారు. త్వరలో అఫీషియల్ గా ప్రకటిస్తారు. ప్ర‌స్తుతం క్రాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు ర‌వితేజ‌.
 

Follow Us:
Download App:
  • android
  • ios