Asianet News TeluguAsianet News Telugu

మాజీ ప్రియుడితో ఘాటు రొమాన్స్.. రెచ్చిపోయారుగా!

ఆపిల్ బ్యూటీ హన్సిక అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు. టీనేజ్ వయసులోనే కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది హన్సిక. పూరి జగన్నాధ్ దర్శత్వం వహించిన దేశముదురు చిత్రంతో హన్సిక హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే గ్లామర్ తో మెప్పించింది.

Ex love birds romance became sensation in social media
Author
Hyderabad, First Published Dec 22, 2019, 2:07 PM IST

ఆపిల్ బ్యూటీ హన్సిక అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు. టీనేజ్ వయసులోనే కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది హన్సిక. పూరి జగన్నాధ్ దర్శత్వం వహించిన దేశముదురు చిత్రంతో హన్సిక హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే గ్లామర్ తో మెప్పించింది. ఆ తర్వాత హన్సిక టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ఇటీవల హన్సిక తెలుగులో సినిమాలు తగ్గించింది. అప్పుడప్పుడూ మాత్రమే హన్సిక తెలుగు చిత్రాలు చేస్తోంది. హన్సిక చివరగా నటించిన చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్. సందీప్ కిషన్ కు జోడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

ప్రస్తుతం హన్సిక హీరోయిన్ సెంట్రిక్ మూవీ 'మహా'లో నటిస్తోంది. జమీల్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హర్రర్ అంశాలు ఉండబోతున్నాయి. మహా చిత్రం నుంచి ఒక్కొక్కటిగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. 

Ex love birds romance became sensation in social media

గతంలో హన్సిక సన్యాసి వేషంలో హుక్కా తాగుతూ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ తీవ్ర వివాదం సృష్టించింది. హిందూ సంఘాలు ఆ పోస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాత్ టబ్ లో హన్సిక రక్తపు మడుగులో స్నానం చేస్తున్న పోస్టర్ కూడా హర్రర్ చిత్ర ప్రియులని ఆకర్షించింది. 

ఆ ఇద్దరు దర్శకులలో.. శంకర్ డైరెక్షన్ లోనే నటిస్తా.. కేజిఎఫ్ హీరో కామెంట్స్!

తాజాగా చిత్ర యూనిట్ మరో పోస్టర్ ని విడుదల చేసి సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచారు. హన్సిక మాజీ ప్రియుడు శింబు ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. శింబు, హన్సిక ఘాటు రొమాన్స్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులని ఫిదా చేస్తోంది. ఒకింత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. 

జూ.ఎన్టీఆర్ పైనే ఆశలు.. అప్పుడైనా జోరు పెరుగుతుందా!

వీరిద్దరూ విడిపోయినప్పటికీ కెమిస్ట్రీ మాత్రం అద్భుతంగా వర్కౌట్ అవుతోంది. శింబు హన్సిక పై  పడుకుని ఉండగా.. ఇద్దరూ తన్మయత్వంలో ఉన్నారు. త్వరలో మహా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

ఉత్తమ నటుడు రాంచరణ్.. ఫిలిం ఫేర్ లో 'రంగస్థలం'కే ఐదు!

రొమాంటిక్ హీరో శింబు ప్రేమకథలు చిట్టా పెద్దదే. నయనతారతో కూడా చాలా కాలం ప్రేమాయణం సాగించాడు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. నయనతారతో విడిపోయిన తర్వాత కూడా శింబు ఆమెతో కలసి నటించాడు. ప్రేమలో విఫలం చెందినప్పటికీ ప్రొఫెషనల్ గా మాత్రం నయన్, హన్సికతో శింబు రిలేషన్ కొనసాగిస్తున్నాడు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios