గత ఏడాది కేజిఎఫ్ చిత్రం విడుదలకు ముందు వరకు హీరో యష్ కేవలం కన్నడలోనే గుర్తింపు ఉన్న నటుడు. కానీ కేజిఎఫ్ చిత్రం విడుదలయ్యాక యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కెజిఎఫ్ చిత్రం యష్ కు తిరుగులేని క్రేజ్ తీసుకువచ్చింది. 

ప్రస్తుతం యష్ కేజిఎఫ్ చాప్టర్ 2లో నటిస్తున్నాడు. మొదటి భాగాన్ని మించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండవ భాగాన్ని తీర్చిదిద్దుతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఇటీవల హీరో యష్ 'సెన్సేషన్ ఆఫ్ సౌత్ సినిమా' అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ అవార్డు కార్యక్రమం చెన్నైలో జరిగింది. 

బోల్డ్ సీన్లకు రెడీ.. 41ఏళ్ల హీరోయిన్ హాట్ కామెంట్స్!

ఈ కార్యక్రమంలో హీరో యష్ కు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. మణిరత్నం, శంకర్ ఇద్దరి దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటావు అని యష్ ని ప్రశ్నించారు. దీనికి ఏమాత్రం ఆలోచించకుండా యష్ డైరెక్టర్ శంకర్ పేరు చెప్పాడు. అందుకు గల కారణాన్ని కూడా యష్ వివరించాడు. 

జూ.ఎన్టీఆర్ పైనే ఆశలు.. అప్పుడైనా జోరు పెరుగుతుందా!

నాకు మణిరత్నం సర్ అంటే కూడా ఇష్టమే. ఆయన చిత్రాలు అద్భుతంగా ఉంటాయి. కానీ నాకు సూపర్ హీరో తరహా చిత్రాలంటే ఎక్కువ ఇష్టం.అలాంటి చిత్రాలని శంకర్ సర్ తెరకెక్కించగలరు అని యష్ వివరణ ఇచ్చారు. శంకర్ ఏమైనా ఆఫర్ ఇచ్చారా అని ప్రశ్నించగా ఇంతవరకు అలాంటిదేమీ లేదని యష్ తెలిపాడు. గతంలో రెండు సార్లు ఆయన్ని కలసినట్లు పేర్కొన్నాడు. 

స్టార్ హీరోల ప్రభావంతో ఎదగలేకపోయిన అద్భుతమైన నటులు!