Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ నటుడు రాంచరణ్.. ఫిలిం ఫేర్ లో 'రంగస్థలం'కే ఐదు!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం గత ఏడాది విడుదలైన సంగతి తెలిసిందే. రంగస్ధలం చిత్రం టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 120 కోట్ల వరకు షేర్ రాబట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శత్వంలో వచ్చిన విలేజ్ రివెంజ్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

Rangasthalam bags 5 film fare awards including Ram Charan as best actor
Author
Hyderabad, First Published Dec 22, 2019, 10:46 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం గత ఏడాది విడుదలైన సంగతి తెలిసిందే. రంగస్ధలం చిత్రం టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 120 కోట్ల వరకు షేర్ రాబట్టింది ఈ చిత్రం. సుకుమార్ దర్శత్వంలో వచ్చిన విలేజ్ రివెంజ్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

ఇదిలా ఉండగా రాంచరణ్ వినికిడి లోపం ఉన్న పాత్రలో అద్భుతంగా నటించాడు. అది పినిశెట్టి, రామలక్ష్మిగా సమంత, జగపతి బాబు, రంగమ్మత్తగా అనసూయ పాత్రలకు కూడా ప్రశంసలు దక్కాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వచ్చిన ఉత్తమ చిత్రంగా రంగస్థలం ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఊహించేవిధంగానే అవార్డుల వర్షం కురుస్తోంది. 

చెన్నె వేదికగా శనివారంరోజు ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో రంగస్థలం చిత్ర హవా స్పష్టంగా కనిపించింది. ఏకంగా ఐదు విభాగాలలో రంగస్థలం ఫిలిం ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకోవడం విశేషం. 

ఉత్తమ నటుడిగా రాంచరణ్(తెలుగు),  ఉత్తమ సహాయ నటిగా అనసూయ, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఉత్తమ లిరిసిస్ట్ చంద్రబోస్  ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు గెలుచుకున్నారు. ఇక ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ మహానటి చిత్రానికి అవార్డులు అందుకున్నారు. 

కొన్ని రోజుల క్రితం ప్రకటించిన జాతీయ అవార్డులలో రంగస్ధలం చిత్రానికి ఆడియో మిక్సింగ్ విభాగంలో అవార్డు దక్కింది.  రాంచరణ్ కు అవార్డు రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఫిలిం ఫేర్ లో రాంచరణ్ కు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాంచరణ్ కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios