ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ తారాస్థాయిలో ఉంది. ఇద్దరు అగ్ర హీరోలు సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ చిత్రాలతో సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అయిపోయారు. మరోవైపు రజనీకాంత్ దర్బార్ చిత్రంతో వస్తున్నాడు. ఇంతటి టఫ్ ఫైట్ లో కూడా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రం జనవరి 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. 

శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభమైనప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఇటీవల సరిలేరు నీ కెవ్వరు, అల వైకుంఠపురములో చిత్ర హడావిడి ఎక్కువ కావడంతో 'ఎంత మంచివాడవురా' చిత్రాన్ని బజ్ బాగా తగ్గిపోయింది. 

ప్రస్తుతం ఈ మూవీపై ఎలాంటి హైప్ లేదు. ఈ అంశం నిర్మాతలని కలవరపెడుతోంది. అప్పుడప్పుడూ ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్స్ తో వస్తున్నా బడా చిత్రాల ప్రభావంతో అవి కనిపించకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో తన సోదరుడి చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. 

ఎంత మంచివాడవురా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. జనవరి మొదటివారంలో ఎంత మంచి వాడవురా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ చిత్రంపై అంచనాలు పెంచాలంటే ఎన్టీఆర్ సాయం అవసరం అని చిత్ర యూనిట్ భావించింది. దీనితో ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

ఈ మధ్య తరచుగా ఎన్టీఆర్ చిత్రాల వేడుకలకు కళ్యాణ్ రామ్.. కళ్యాణ్ రామ సినిమాల వేడుకకు ఎన్టీఆర్ హాజరవుతున్నారు. ఎంత మంచి వాడవురా మూవీ రూపంలో ఈ నందమూరి హీరోలిద్దరిని ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు మరోసారి దక్కనుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కనీసం ఎన్టీఆర్ ప్రమేయంతో అయినా ఈ చిత్రానికి బజ్ ఏర్పడుతుందేమో చూడాలి. 

బోల్డ్ సీన్లకు రెడీ.. 41ఏళ్ల హీరోయిన్ హాట్ కామెంట్స్!

ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

నేనేం సీక్రెట్ గా పెళ్లి చేసుకోలేదు.. రానా హీరోయిన్ కామెంట్స్!