దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్స్ ఫోజింగ్ కు, బోల్డ్ ఫోటో షూట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. తెలుగులో పూరి దర్శత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా పరిచయమైంది. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ అని తెలిసే వచ్చానని.. ఇక్కడ సిగ్గు పడితే కుదరదని గతంలో దిశా పటాని తాను చేస్తున్న ఫోటో షూట్స్ గురించి చెప్పుకొచ్చింది. 

అందుకు తగ్గట్లుగానే వెండితెరపై ఎలాంటి మొహమాటం లేకుండా దిశా రెచ్చిపోతోంది. దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్ నటించిన బాఘీ 3 చిత్రం మార్చి 6న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యకమాలతో హోరెత్తిస్తున్నారు. అహ్మద్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకుడు. 

'దాన్ని కాల్చి చంపేద్దాం'.. మాజీ భార్యపై స్టార్ హీరో కుట్ర.. మెసేజ్ లీక్!

అహ్మద్ ఖాన్ ముఖ్యంగా ఈ చిత్రంలో మాస్ మసాలా అంశాలపై ఫోకస్ పెట్టినట్లు ప్రమోషన్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. టైగర్ ష్రాఫ్ యాక్షన్ తో అదరగొడుతున్నాడు. ఇక హీరోయిన్ శ్రద్దా కపూర్ అందాలు ఆరబోస్తోంది. అది చాలదు అన్నట్లు దిశా పటానితో ఐటెం సాంగ్ చేయించారు. 

చీరకట్టులో అనసూయ వయ్యారాలు.. నడుము అందంతో సెగలు రేపుతోంది

తన ప్రియుడి చిత్రమే కావడంతో దిశా పటాని బికినిలో బోల్డ్ స్టెప్పులతో రెచ్చిపోయింది. మునుపెన్నడూ లేనివిధంగా దిశా హాట్ నెస్ తో ఈ సాంగ్ లో అదరగొడుతోంది. కొద్ది సేపటి క్రితమే విడుదల చేసిన 'డు యు లవ్ మి' అనే సాంగ్ మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. దిశాపటాని లా ఇటీవల కాలంలో మరే హీరోయిన్ ఇంత బోల్డ్ గా స్టెప్పులేయలేదు. కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించేలా ఉన్న ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి..