దాంపత్య సంబంధాలను క్షణికావేశం భగ్నం చేస్తోంది. హాయిగా సంసార జీవితాన్ని గడపాల్సిన భార్యలు వారి భర్తలను దారుణంగా, కిరాతకంగా హతమారుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ఈ తరహా సంస్కృతి ఎక్కువవుతోంది.

నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఒకరు సరిపోరని ఏకంగా ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ దారుణానికి పాల్పడిన భార్య, ప్రియుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు. 

Also Read:కలలో అక్రమ సంబంధం.. నిజమౌతుందా..?

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తాళికట్టిన భర్తను ప్రియుడుతో కలిసి దారుణంగా హత్య చేసింది భార్య. డిండి మండలం దేవత్ పల్లితండాకు చెందిన బానోవత్ దులియా అలియాస్ శంకర్ భార్య విజయ తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చి చైతన్య పురి యాదవనగర్ లో నివసిస్తున్నాడు.

అయితే విజయ మరిది వరసయ్యే సపావత్ కిషన్ తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబందం పెట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన శంకర్ ఆమెను మందలించడంతో అతడి అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది. 

Also Read:భార్యకి ముగ్గురితో అక్రమ సంబంధం..భర్త ఏంచేశాడంటే..

ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి తాగిన శంకర్ నిద్రలో ఉండగా విజయ తన ప్రియుడు సపావత్ కిషన్ తో కలిసి అతడి ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం శంకర్ కరెంట్ షాక్ తో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. 

భార్య విజయ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న మృతుడు భార్య విజయ, ప్రియుడు సపావత్ కిషన్ ను బుధవారం అరెస్ట్ చేశారు. విచారణలో తామే శంకర్ ను హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏసీపీ పృథ్వీరావ్ స్పష్టం చేశారు. 

వావి వరసలు మరిచి అత్తతో అక్రమ సంబంధం పెట్టుకుని, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని మేనమామను దారుణంగా హత్య చేశాడో మేనల్లుడు. సనత్ నగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి శ్రీనివాస్ హత్యకు అతని మేనల్లుడే కారణమని పోలీసులు నిర్థారించారు.

Also Read:పెళ్లైనవాడితో అక్రమ సంబంధం.. ప్రసాదంలో విషం కలిపి

భార్యకి ముగ్గురితో అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకున్న భర్త.. ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఈ దారుణ సంఘటన రాజ్ కోట్ లో చోటుచేసుకుంది. కరెంట్ షాక్ పెట్టుకొని మరీ కన్నుమూశాడు.