‘‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’’ అన్నారు మహాత్మా గాంధీ. గాంధీ గారు చెప్పిన కలల సాకారం గురించి పక్కన పెడితే.. నిద్రలో తరచూ అందరికీ కలలు వస్తూనే ఉంటాయి. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమౌతుంటాయి అని కూడా చాలా మంది చెబుతుంటారు. ఆ కలలు నిజమవ్వడం పక్కన పెడితే.. ప్రతి కలకు ఒక అర్థం ఉంటుందట. ఏ కలకి ఎలాంటి అర్థం ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం...

కొందరికి వాళ్లు చనిపోయినట్లు.. లేదా ఇంకెవరో చనిపోయినట్లు కలలు వస్తుంటాయి. దాని అర్థం నిజంగా చనిపోతారని కాదు. మీ జీవితంలో ఒక అంకం లేదా.. ఒక బంధం ముగిసిపోతుంది అనేందుకు ఒక సూచన మాత్రమేనట.

కొందరు స్త్రీలు..తాము కడుపుతో ఉన్నట్లు కలలు కంటూ ఉంటారు. ఇది గొప్ప ఎదుగుదలకు, జీవితంలో పెద్ద మార్పుకి సూచన. కొందరికి ఎక్కువగా కలలో డబ్బులు కనపడుతూ ఉంటాయి. దాని అర్థం మన మనస్తత్వంలోని లోపాలకు ప్రతిబింబం ఆ డబ్బు.

ఇంకొందరు.. జీవిత భాగస్వామిని మోసం చేసి.. వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కలలు కంటుంటారు. వాటిని అర్థం మీ లోని అణగదొక్కిన లైంగిక వాంఛలు, జీవిత భాస్వామితో ఆనందంగా లేకపోవడం, స్వీయ విలువ తగ్గినట్లు భావించినప్పుడు ఇలాంటి కలలు వస్తుంటాయి.