భార్యకి ముగ్గురితో అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకున్న భర్త.. ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఈ దారుణ సంఘటన రాజ్ కోట్ లో చోటుచేసుకుంది. కరెంట్ షాక్ పెట్టుకొని మరీ కన్నుమూశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్ కోట్ కి చెందిన ప్రహ్లాద్ కి ధన్ బాయ్ మహేశ్వరితో వివాహమైంది. కొన్ని సంవత్సరాల పాటు..వీరి సంసారం బాగానే సాగింది. కాగా.. తన భార్య మహేశ్వరికి నరసింహ, రవి శంకర్, మహేష్ అనే ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న విషయం ప్రహ్లాద్ ఆలస్యంగా తెలుసుకున్నాడు.

ఈ విషయంపై భార్యను నిలదీయగా.. ఆమె నిజమేనని అంగీకరించింది. అప్పటి నుంచి భార్య మహేశ్వరితో కలిసి.. ఆ ముగ్గురు యువకులు ప్రహ్లాద్ ని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. రోజూ ఇంటికి వచ్చి బెదిరించేవారు. తన కళ్ల ముందే భార్యతో గడిపేవారు. వీటన్నింటినీ చూస్తూ.. ప్రహ్లాద్ తట్టుకోలేకపోయాడు. దీంతో.. సెప్టెంబర్ 13వ తేదీన కరెంట్ షాక్ పెట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

కాగా.. ఇన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఇటీవల కన్నుమూశాడు. కాగా.. ప్రహ్లాద్ బావ లాల్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రహ్లాద్ భార్య మహేశ్వరి సహా.. ఆమె ముగ్గురు ప్రియులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రహ్లాద్ ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ వారిపై కేసు పెట్టారు. దర్యాప్తు కొనసాగుతోంది.