Asianet News TeluguAsianet News Telugu

గెలిస్తే ప్లేఆఫ్స్‌..! ఓడితే బ్యాగ్ ప్యాక్.. కీలక మ్యాచ్లో టాస్ నెగ్గిన గుజరాత్

WPL 2023:ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  లో నేడు  గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే యూపీ వారియర్స్ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. 

WPL 2023: Play Offs Ahead,  Gujarat Giants won The Toss and Elects  Bat First vs UP Warriors MSV
Author
First Published Mar 20, 2023, 3:02 PM IST

ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ఇదివరకే ముంబై, ఢిల్లీలు తమ  బెర్త్ లు ఖాయం చేసుకోగా మూడో స్థానం ఎవరిదన్నదానిపై కొంత సందిగ్దత నెలకొంది.  మూడో స్థానం చేరడానికి యూపీతో పాటు గుజరాత్ జెయింట్స్, ఆర్సీబీకీ అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నేడు  బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్ లో  స్నేహ్ రాణా సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అలీస్సా హేలీ సారథ్యంలోని యూపీ వారియర్స్ బ్యాటింగ్ కు రానుంది.  

ఆడిన ఏడు మ్యాచ్ లలో రెండింట్లో మాత్రమే నెగ్గిన గుజరాత్ జెయింట్స్ కు  ప్లేఆఫ్స్ చేరడానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో ఆ జట్టు యూపీని ఓడించి..   తర్వాత మ్యాచ్ లలో  యూపీ, ఆర్సీబీలు తమ మ్యాచ్ లలో ఓడితే అప్పుడు  స్నేహ్ రాణా టీమ్ కు   ప్లేఆఫ్ అవకాశాలు మెరుగుపడతాయి. 

ఇక మూడో స్థానం రేసులో  ఆర్సీబీ, గుజరాత్ కంటే ముందు వరుసలో ఉన్న జట్టు యూపీ వారియర్స్.. ఆడిన ఆరు మ్యాచ్ లలో మూడు గెలిచిన ఆ జట్టు.. నేడు గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో గెలిస్తే మరే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.  ఓడితే మాత్రం  తర్వాత మ్యాచ్  లో ఆ  జట్టు ఢిల్లీని ఓడించాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలో  నేటి  గుజరాత్ - యూపీ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. 

 

తుది జట్లు :  ఈ మ్యాచ్ కోసం గుజరాత్ జట్టులో ఓ మార్పు జరిగింది. సబ్బినేని మేఘన   స్థానంలో మోనికా పటేల్ తుది జట్టులోకి వచ్చింది.  యూపీ జట్టు గత మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే  ఆడుతోంది. 

యూపీ : అలీస్సీ హేలీ (కెప్టెన్),   దేవికా వైద్య, కిరణ్ నవ్‌గిరె, తహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హరీస్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, సోఫీ ఎకిల్‌స్టోన్, పర్శవి చోప్రా, అంజలి శర్వణి, రాజేశ్వరి గైక్వాడ్ 

గుజరాత్ : సోఫీ డంక్లీ, లారా వోల్వార్డ్ట్,  హర్లీన్ డియోల్,  ఆష్లే గార్డ్‌నర్, డయాలన్ హేమలత, మోనికా పటేల్, సుష్మా వర్మ, స్నేహ్  రాణా (కెప్టెన్), అశ్వని కుమారి, కిమ్ గార్త్, తనూజా కన్వర్ 

Follow Us:
Download App:
  • android
  • ios