కోహ్లీ చేతిలో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఎలా ఆడాలో వారికి చూపిస్తూ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియోకి ఇప్పటి వరకు 7.3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ... మైదానంలోకి అడుగుపెడితే చాలు పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. అందుకు ఆయనను రన్ మెషిన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. మైదానంలో బ్యాట్ పట్టి చెలరేగడంతో పాటు... అప్పుడప్పుడు స్టెప్పులు వేయడం కూడా కోహ్లీకి అలవాటే. ఇప్పటి వరకు చాలా సార్లు కోహ్లీ డ్యాన్స్ వేసిన వీడియోలు మీరు చూసే ఉంటారు. కాగా.... తాజాగా ఆయన మరోసారి డ్యాన్స్ చేశారు. నార్వేయన్ గ్రూప్ తో కలిసి ఆయన స్టెప్పులు వేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ కోసం ముంబై వెళ్లిన విరాట్.. అక్కడ నార్వేకు చెందిన డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్ తో కలిసి స్టెప్పులేశాడు. ఈ వీడియోని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

View post on Instagram

కోహ్లీ చేతిలో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఎలా ఆడాలో వారికి చూపిస్తూ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియోకి ఇప్పటి వరకు 7.3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. కాగా... ఈ వీడియోకి ఆయన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ స్పందించారు. ఫైర్ ఎమోజీలను ఆమె కామెంట్ లో పేర్కొన్నారు.