అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల కౌంటింగ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంంది. ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిఫలితం వెలువడింది. 

ఆ తొలిఫలితం కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కావడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వీ ఆర్ ఎలిజా భారీ విజయం సాధించారు. సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వీఆర్ ఎలీజా 31వేల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 

చింతలపూడి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా డా.కర్రరాజారావు పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పీతల సుజాత పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కూడా అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమెకు చంద్రబాబు టికెట్ ఇవ్వకుండా డా. కర్ర రాజారావుకు ఇచ్చారు.