Satirical poem with cartoon

ఆ సమయంలో కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ కూడ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు.ఈ ఎన్నికల్లో కూడ మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.

తొలివిజయం వైసీపీదే

ఆ తొలిఫలితం కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కావడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వీ ఆర్ ఎలిజా భారీ విజయం సాధించారు. సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వీఆర్ ఎలీజా 31వేల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.