విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సైకిలెక్కేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మీడియా సమావేశంలో తాను ఏ పార్టీలో చేరేది లేదని చెప్పిన రాధ తన అనుచరులు, అభిమానుల ఒత్తిడి మేరకు అధికార పార్టీ తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

ఈనెల 26 అంటే శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాధాను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. 

రాధా పార్టీలోకి చేరిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న సంకేతాలిచ్చేందుకు కృష్ణా  జిల్లా నేతలను సైతం ఒప్పించారు. అటు టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు బచ్చల అర్జునుడు, టీడీ జనార్థన్ లను సైతం రాయబారానికి పంపారు. 

ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఆఫర్ కూడా ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇకపోతే గురువారం ప్రెస్మీట్ లో రాధా తాను తెలుగుదేశం పార్టీలో చేరడం లేదని పెద్దాయన చంద్రబాబు తనను క్షమించాలని కోరారు. 

తనకు పదవులు కన్నా, పార్టీలు కన్నా తన తండ్రి వంగవీటి మోహనరంగా ఆశయ సాధనే లక్ష్యమని చెప్పుకొచ్చారు. తన తండ్రి ఆశయాల కోసం తాను ప్రజా జీవితంలో ఉంటానని తనకు సహకరించాలని కోరారు. అయితే అనుచరుల ఒత్తిడి మేరకు ఇక సైకిల్ ఎక్కాలని రాధా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

అందులో భాగంగానే తన తండ్రి రంగా హత్య విషయంలో తెలుగుదేశం పార్టీకి క్లీన్ చీట్ ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన తండ్రి హత్యకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆవేశంలో మాట్లాడని తన తప్పు తెలుసుకున్నానని చెప్పడం వెనుక తన అభిమానులను కార్యకర్తల మైండ్ వాష్ చెయ్యడంలో భాగమేనంటూ కూడా ప్రచారం జరుగుతుంది. 

అయితే రాధా తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవమెంత...? రాధా టీడీపీలోకి వెళ్తారా...? లేదా అన్నది తెలియాలంటే శనివారం సాయంత్రం వరకు వేచి చూడాలన్నమాట.   

ఈ వార్తలు కూడా చదవండి

ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ వంగవీటి రాధా చదివారు: పెద్దిరెడ్డి

జగన్‌పై వంగవీటి రాధా విమర్శలు: నాని కౌంటర్

నా క్యారెక్టర్ నే చంపారు: జగన్ మీద వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు పిలిస్తే కూడా రాజకీయం చేస్తారా: వైసిపి నేతలపై రాధా ఫైర్

చంపేస్తామని వైఎస్ జగన్ బెదిరించారు: వంగవీటి రాధా సంచలన ఆరోపణ

జగన్ వార్నింగ్ ఇచ్చారు, అవమానించారు: వంగవీటి రాధా సంచలనం

నాకు రూ.100కోట్లు ఇచ్చాడా, ఏ పనికిమాలిన నా కొడుకు వాగాడు : వంగవీటి రాధా

వంగవీటి రాధ టీడీపీలో చేరడం వెనుక, సూత్రధారి ఈయనేనా..?

టీడీపీలోకి జంప్: రాధా గెలుస్తాడా...? సెంటిమెంట్ గెలుస్తుందా..?

టీడీపిలోకి వంగవీటి రాధా: అవినాష్ జోరుకి బ్రేక్

టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీ