వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్‌కు తెరదించారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలోకి చేరుతారంటూ జరిగిన ప్రచారానికి చెక్ పెడుతూ.. టీడీపీ వైపే మొగ్గుచూపారు. ఈ నెల 25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాధాకృష్ణ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

నిన్న కేబినెట్ సమావేశం అనంతరం కృష్ణాజిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు.. రాధను టీడీపీలోకి చేర్చుకునే అంశంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మెజారిటీ నేతలు వంగవీటి రాకకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా కృష్ణాజిల్లా టీడీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

అంతా బాగానే ఉంది కానీ రాధాకృష్ణ టీడీపీలోకి రావడం ఆ పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావుకు మింగుడు పడటం లేదు. గత ఎన్నికల్లో సెంట్రల్ నుంచి తిరుగులేని మెజారిటీ గెలిచిన బొండా ఉమా ఈ సారి కూడా తనకు టికెట్ గ్యారెంటీ అని భావించారు.

అయితే ఇప్పుడు రాధాకృష్ణ రంగప్రవేశంతో బొండా రాజకీయ భవితవ్యం ప్రమాదంలో పడింది. సెంట్రల్ సీటు రాధకు ఇచ్చేస్తే ఆయన గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో నివసించేది కాపులే, దానికి తోడు దివంగత వంగవీటి మోహనరంగా అభిమానులతో పాటు ఆయన మద్ధతుదారుల సంఖ్య అధికం.

గత ఎన్నికల్లో బొండా ఉమా విజయానికి దోహదం చేసింది కూడా కాపులేనన్న విషయం బహిరంగ రహస్యం. ఈ సమయంలో బొండాకు ఈసారి టికెట్ దక్కడం అనుమానమే. విజయవాడ తూర్పులో గద్దె, పశ్చిమలో జలీల్ ఖాన్ 2019 ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.

జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా సిట్టింగ్‌లకే మరోసారి చంద్రబాబు అవకాశం ఇస్తారని జిల్లాలో చర్చ జరుగుతోంది. దీంతో తన రాజకీయ భవితవ్యంపై బొండా ఆందోళనగా ఉన్నారు. రాధ టీడీపీలోకి చేరేలోగా అధినేతను కలిసి ఆయన నుంచి హామీ తీసుకోవాలని బొండా తన అంతరంగీకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాం