వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు బెజవాడలో ప్రచారం జరుగుతోంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా నేతలతో సమావేశమై రాధను పార్టీలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

పార్టీ ప్రయోజనాల కోసమే రాధను తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆయనను కలుపుకుని వెళ్లాలని నేతలకు సూచించారని, ఈ నెల 25న రాధాకృష్ణ...చంద్రబాబు సమక్షంలో పచ్చజెండా కప్పుకుంటారని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ, పార్టీ మార్పు అంశాలపై రాధాకృష్ణ.. రాధా-రంగా మిత్రమండలి సభ్యులతో సమావేశమయ్యారు.

ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం కార్యకర్తలు, అనుచరుల నుంచి వ్యక్తం కావడంతో టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ టీడీపీలో చేరుతారా లేదంటే ఇదంతా కేవలం ప్రచారమా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 
 

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాం