విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగుదేశం పార్టీ రూ.100కోట్లు ఇవ్వడం వల్లే తాను వైసీపీ వీడానని వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇలాంటి వ్యాఖ్యలు ఏ నాకొడుకు చేసినా తాను పట్టించుకోనన్నారు. ఆ వందకోట్లు ఎలా ఇచ్చారు. 

బ్లాక్ మనీ, వైటా, నేరుగా క్యాష్ ఇచ్చారా, సూట్ కేసుల్లో పట్టుకొచ్చారో ఆరోపణలు చేసిన వారే చెప్పాలని నిలదీశారు. తాను డబ్బుకు అమ్ముడిపోయేవాళ్లం కాదన్నారు. తనకు తన తండ్రి ఇచ్చిన భవిష్యత్ ఉందన్నారు. తాను రాజకీయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. 

తాను ఎట్టి పరిస్థితుల్లో తన తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతలను చెడగొట్టనని స్పష్టం చేశారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చడమే తన లక్ష్యమని వంగవీటి రాధా స్పష్టం చేశారు. తనను పార్టీలో అవమానిస్తే అన్ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. 

ఇక భరించలేదన్నారు. నాలుగున్నరేళ్లలో తన క్యారెక్టర్ ని వైసీపీ చంపేసిందన్నారు. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా తాను పయనిస్తుంటే అదే తన బలహీనతగా చెప్పుకుని ఇబ్బందులకు గురి చేశారని చెప్పుకొచ్చారు. 

 

చంపేస్తామని వైఎస్ జగన్ బెదిరించారు: వంగవీటి రాధా సంచలన ఆరోపణ

జగన్ వార్నింగ్ ఇచ్చారు, అవమానించారు: వంగవీటి రాధా సంచలనం

నాకు రూ.100కోట్లు ఇచ్చాడా, ఏ పనికిమాలిన నా కొడుకు వాగాడు : వంగవీటి రాధా