విజయవాడ: తన రాజకీయ భవిష్యత్ పై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ తనపై జాలి చూపిస్తున్నానంటుంది. మరో పార్టీ ఏంటో తెలియదు. ఇంకోపార్టీ వంగవీటి రాధ వ్యవస్థ అని ఆయన లక్ష్యాలు ఎంతో ఉన్నతమైనవని కొందరి భావన అన్నారు. 

వంగవీటి రంగా ఒక వ్యక్తి కాదని వ్యవస్థ అని నమ్మి తనను ఆ పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. దివంగత నేత వంగవీటి మోహన్ రంగను అభిమానించే వాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. 

తన తండ్రి మోహనరంగ ఆశయాలపై తనను గౌరవించి చంద్రబాబు నాయుడు తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రముఖ్యమంత్రి గౌరవంగా సాదరంగా ఆహ్వానించి రంగాలాంటి వ్యవస్థ పదిమందికి ఉపయోగపడతాదని ఆలోచించి పిలవడం జరిగిందన్నారు. 

అంతలోనే సోషల్ మీడియా వేదికగా దాడులు, మాటలు నానా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాధా అనే వ్యక్తికి పదవులు ముఖ్యం కాదని తండ్రి ఆశయమే ముఖ్యమన్నారు. చంద్రబాబు నాయుడు పెద్దమనిషిగా ఆహ్వానించారని తెలిపారు. 

అన్యధా భావించకుండా తనను మన్నించాలని చంద్రబాబును కోరారు. తన ప్రజా జీవితం నడుస్తూనే ఉంటుందని అయితే పేదల కోసమే తన పోరాటం అని తన తండ్రి ఆశయం కోసం పనిచేస్తానని దయ ఉంటే తనకు సహకరించాలని కోరారు. పెద్దమనిషి తరహాగా తనను తప్పుగా అనుకోరని భావిస్తున్నట్లు తెలిపారు.  

తన తండ్రి ఆశయాలే తనకు లక్ష్యమన్నారు. విజయవాడలో ఇళ్లు లేని పేదవాడు అనేది ఉండకూడదన్నదే తన తండ్రి రంగా ఆశయమని దాన్ని నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు. చంద్రబాబు నాయుడు తన తండ్రి ఆశయ సాధనకు సహకరించాలని కోరారు. 

విజయవాడలో ఎంతోమంది నిరుపేదలు ఇళ్లులేని వారు ఉన్నారని వారికి ఇళ్లు పట్టాలు ఇవ్వాలని కోరారు. తాను ఇక రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం లేదని కానీ ఊపిరి ఉన్నంత వరకు తాను ప్రజసేవకే అంకితమవుతానని స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి 

చంపేస్తామని వైఎస్ జగన్ బెదిరించారు: వంగవీటి రాధా సంచలన ఆరోపణ

జగన్ వార్నింగ్ ఇచ్చారు, అవమానించారు: వంగవీటి రాధా సంచలనం

నాకు రూ.100కోట్లు ఇచ్చాడా, ఏ పనికిమాలిన నా కొడుకు వాగాడు : వంగవీటి రాధా