వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతుండటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఉదయం నుంచి వార్తలు, రాజకీయాలు రాధాకృష్ణ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే జనసేనలోకి వెళ్లడం పక్కా అని అంతా భావించారు. 

రంగా అభిమానులు, కాపు సామాజికవర్గం సైతం ఇతే అభిప్రాయంలో ఉన్నాయి. కానీ రాధా ఈ స్టెప్ వేయడం వెనుక ఏం జరిగి వుంటుంది, ఆయనను ఆ దిశగా నడిపించిన వ్యక్తి ఎవరై ఉంటారనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా అందరి చూపు ఒకరిపై నిలుస్తోంది. ఆయనే టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహాన్. 

ఇందుకు కారణాలు లేకపోలేదు. వంగవీటి రాధాకృష్ణ, వల్లభనేని వంశీ, కొడాలి నాని ముగ్గురు ఆప్తమిత్రులు, పార్టీలు వేరైనా అందరూ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. కోస్తాలో బలమైన సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వంగవీటిని టీడీపీలోకి తీసుకురావాలని అప్పట్లో వల్లభనేని ఎంతో ప్రయత్నించారు. 

అయితే రాధ అందుకు అంగీకరించక, వైసీపీలోనే కొనసాగారు. అయితే కొద్దిరోజుల నుంచి వైసీపీ అధినేత జగన్ తనకు ప్రాధాన్యతనివ్వడం లేదని గ్రహించిన రాధాకృష్ణ.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఏకంగా పార్టీకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

నిజానికి తన తండ్రి రంగా వర్ధంతి రోజునే ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పాలని భావించినప్పటికీ మిత్రుడు కొడాలి నాని వారించడంతో వెనక్కితగ్గారు. అప్పటికి కూడా వైఎస్ జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో చివరికి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని కృతనిశ్చయంతో ఉన్న రాధ జనసేనను అందుకు వేదికగా మార్చుకోవాలనుకున్నారు. అయితే వల్లభనేని వంశీ మధ్యలో కలగజేసుకుని సామాజిక వర్గ సమీకరణాలు, ప్రజలనాడిని బట్టి టీడీపీలో చేరాలని సలహా ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 

చంద్రబాబుతో రాధ గురించి చెప్పి ఇద్దరి మధ్య ఆయన రాయబారం నడిపినట్లు బెజవాడ టాక్. రాధాకృష్ణ లాంటి మాస్ లీడర్ సేవలు పార్టీకి అవసరమని భావించిన టీడీపీ అధినేత వల్లభనేనికి గ్రీన్ ఇచ్చిన తర్వాతనే రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారని అంటున్నారు. మొత్తం మీద రాధాకృష్ణ వైసీపీ వీడకుండా కొడాలి నాని చేసిన ప్రయత్నాలు విఫలమవ్వగా...టీడీపీవైపుకి వంగవీటిని లాక్కొచ్చి వల్లభనేని వంశీ పోటీలో విజయం సాధించారని విశ్లేషకులు అంటున్నారు. 

టీడీపిలోకి వంగవీటి రాధా: అవినాష్ జోరుకి బ్రేక్

టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాం