రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ప్రమాదంలో తెలంగాణ ప్రజలు సైతం మరణించడంతో మరోమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో భేటీ అయ్యారు. బోటు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ ప్రజలే అధికంగా ఉన్నారని జగన్ కు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు మృతదేహాలను అప్పగించాలని కోరారు. 

అనంతరం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాయలంలో సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సీఎం జగన్ గట్టిగా సమీక్ష నిర్వహించారని తెలిపారు. సీఎం జగన్ చెప్పిన అంశాల్లో చాలావరకు బాధితులు చెప్పారన్నారు. 

సమీక్షలో బోట్లపై నియంత్రణ లేదనే అంశం స్పష్టమైందన్నారు. ఈ సమీక్షా సమావేశం ద్వారా చాలా వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన జీవోలో బోట్లను ఎవరు నియంత్రించాలన్నదానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. తన 40 ఏళ్ల రాజకీయజీవితంలో ఇలాంటి జీవోను ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. 

బాధితులకు సీఎం జగన్ బాసటగా నిలిచారని అందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అధికారులు రాత్రి నుంచి చాలా బాగా పనిచేశారని కితాబిచ్చారు. అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం సపోర్టు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి.. బాధితు కుటుంబ సభ్యులకు అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. 

ఐదు లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా రిస్క్‌చేసి సహాయ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. గాయపడ్డవారికీ, సురక్షితంగా బయటపడ్డ వారికీ పరిహారం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 

ఈ వార్తలు కూడా చదవండి

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం