అమరావతి: జ్యోతిని ఆమె ప్రియుడు శ్రీనివాస్ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. గుంటూరు ఎన్ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను గుంటూరు అర్బన్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు శుక్రవారం నాడు విచారించారు. ఈ విచారణలో శ్రీనివాస్ అసలు విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం.

ఈ నెల 11వ తేదీన అమరావతి టౌన్‌షిప్‌ సమీపంలో జ్యోతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. జ్యోతి  వెంట ఉన్న శ్రీనివాస్ తలపై గాయంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం నాడు శ్రీనివాస్‌ను గుంటూరు అర్బన్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ విచారించారు.

జ్యోతిని ఈ నెల 11వ తేదీన శ్రీనివాస్‌ను అమరావతి టౌన్‌షిప్‌కు రప్పించాడు. శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకోవాలని  జ్యోతి ఒత్తిడి చేసిందని విచారణలో వెల్లడించినట్టుగా సమాచారం. దీంతో శ్రీనివాస్‌ జ్యోతిని శ్రీనివాస్ హత్య చేసినట్టుగా విచారణలో ఒప్పుకొన్నాడని సమాచారం.

గతంలో ఇదే ప్రాంతానికి శ్రీనివాస్ పలువురు యువతులను తీసుకొచ్చి నగ్న వీడియోలను తీశాడని పోలీసులు గుర్తించారు.  జ్యోతిని కూడ వదిలించుకొనే క్రమంలోనే ఆమెను హత్య చేసినట్టుగా గుర్తించారు.

జ్యోతి మృతి చెందడంతో  ఇద్దరు స్నేహితులను కూడ శ్రీనివాస్ పిలిపించుకొన్నాడు.  వారితో తన తలపై కొట్టించుకొన్నాడు. శ్రీనివాస్‌కు సహకరించిన ఇద్దరు స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

జ్యోతి హత్య: పోలీసుల తీరుపై కుటుంబ సభ్యుల ధర్నా

అమరావతి హత్య, రేప్‌‌కేసు : జ్యోతి మృతదేహం వెలికితీత, రీ పోస్ట్‌మార్టం

జ్యోతి హత్య కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు

శ్రీనివాస్ బైక్‌పై జ్యోతి: సీసీటీవీ కెమెరాకు చిక్కిన దృశ్యం

అమరావతి రేప్, హత్య కేసులో సంచలనం: ప్రియుడిపైనే అనుమానాలు

ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి