అమరావతి: జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతికి  ఆమె ప్రియుడు శ్రీనివాస్ కారణమని  ఆమె సోదరుడు ప్రభాకర్ ఆరోపించారు. అమ్మాయిల చేత శ్రీనివాస్  ఫోన్ చేయించి తన సోదరిని ఇంటి నుండి రప్పించాడని ఆయన ఆరోపించారు.

సోమవారం రాత్రి జ్యోతి, శ్రీనివాస్‌లు మంగళగిరి మండలం నవులూరు ఉడా టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని డొంక రోడ్డులోకి వెళ్లారు. అక్కడ వీరిద్దరిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో  జ్యోతి మృతి చెందగా, శ్రీనివాస్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రతి రోజూ తన సోదరి జ్యోతి తనకు విష్ చేసేదన్నారు. ఇవాళ తన బర్త్‌డే అని కానీ, తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు తన సోదరి లేదన్నారు. 

రెండేళ్ల క్రితం జ్యోతి, శ్రీనివాస్‌ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై శ్రీనివాస్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా గ్రామం వదిలి వెళ్లారని చెప్పారు.  అయితే ఏడాదిన్నర నుండి వీరి మధ్య మళ్లీ సంబంధాలు కొనసాగిస్తున్నారని  తెలిసింది.

సోమవారం మధ్యాహ్నం ఓ అమ్మాయి సుమారు నాలుగు దఫాలు ఫోన్లు చేసిందని  ప్రభాకర్ చెప్పారు. ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకొనేందుకు రావాలని కోరుతూ పదే పదే ఫోన్లు చేసినట్టు చెప్పారు. 

శ్రీనివాస్  అమ్మాయితో పోన్లు చేయించినట్టుగా ప్రభాకర్ ఆరోపించారు. శ్రీనివాస్ వల్లే తన సోదరి జ్యోతి మృతి చెందిందని ఆయన చెబుతున్నారు.

 

సంబంధిత  వార్తలు

ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి