గుంటూరు:గుంటూరు జిల్లాలోని అమరావతి టౌన్‌షిప్‌ సమీపంలో ఈ నెల 11వ తేదీన హత్యకు గురైన జ్యోతి కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమను వేధించడంపై జ్యోతి కుటుంబసభ్యులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి హత్య కేసులో  నిందితులను అరెస్ట్ చేయాలని  కోరుతూ శుక్రవారం నాడు గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు.

గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో జ్యోతి మృతి చెందగా, ఆమె ప్రియుడు శ్రీనివాస్  తీవ్ర గాయాలతో  ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఇవాళ శ్రీనివాస్‌ను  పోలీసులను ప్రశ్నించే అవకాశం ఉంది. జ్యోతి హత్యపై ఆమె ప్రియుడు శ్రీనివాస్‌పైనే ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జ్యోతి హత్య తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు కూడ పోలీసుల దర్యాప్తుపై  పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. జ్యోతి పోస్ట్‌మార్టం తర్వాత ఆమె ఒంటిపై ఉన్న దుస్తులను పోలీసులు సేకరించలేదు. మరోవైపు జ్యోతి పోస్టు మార్టంపై కూడ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ పరిణామాలపై జ్యోతి కుటుంబసభ్యుల డిమాండ్‌ మేరకు గురువారం నాడు రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. రీ పోస్ట్‌మార్టం నివేదిక శుక్రవారం నాడు వచ్చే అవకాశం ఉంది. జ్యోతిని ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు ఇంకా తేల్చలేదు.

జ్యోతి హత్య విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కుటుంబసభ్యులతో పాటు ప్రజా సంఘాలు శుక్రవారం నాడు గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగాయి. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరో వైపు జ్యోతి హత్య కేసులో తమనే పోలీసులు అనుమానించడంపై కూడ జ్యోతి కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.


 సంబంధిత వార్తలు

అమరావతి హత్య, రేప్‌‌కేసు : జ్యోతి మృతదేహం వెలికితీత, రీ పోస్ట్‌మార్టం

జ్యోతి హత్య కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు

శ్రీనివాస్ బైక్‌పై జ్యోతి: సీసీటీవీ కెమెరాకు చిక్కిన దృశ్యం

అమరావతి రేప్, హత్య కేసులో సంచలనం: ప్రియుడిపైనే అనుమానాలు

ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి