గుంటూరు: అమరావతికి టౌన్‌షిప్‌ సమీపంలో జ్యోతి హత్య కేసులో పోలీసులు కీలకమైన సీసీటీవీ పుటేజీ లభ్యమైంది. ఈ పుటేజీని మంగళవారం నాడు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

నిన్న సాయంత్రం అమరావతి టౌన్‌షిప్‌ సమీపంలోని ముళ్లపొదల్లోకి శ్రీనివాసరావు బైక్‌పై  తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం మూడు టీమ్‌లను పోలీసులు ఏర్పాటు చేశారు. 

మంగళగిరి నుండి నవులూరి వైపుకు వెళ్లే దారిలో ఉన్న సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి. అమరావతి టౌన్‌షిప్‌లో  దుండగులు దాడి చేయడంతో జ్యోతి మృత్యువాత పడింది, శ్రీనివాస్ గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. జ్యోతి మృత్యువాత పడిన తర్వాత శ్రీనివాస్ తన స్నేహితులకు ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

మరో వైపు జ్యోతి, శ్రీనివాస్‌లు కూడ హత్యకు ముందు ఓ హోటల్‌లో  ఫ్రైడ్ రైస్‌ తిన్నట్టుగా  పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్‌ తన స్నేహితుడి బైక్ మీద జ్యోతిని తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ను ఇవాళ సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ మరింత లోతుగా విచారించే అవకాశం ఉందని  సమాచారం. 

సంబంధిత వార్తలు

అమరావతి రేప్, హత్య కేసులో సంచలనం: ప్రియుడిపైనే అనుమానాలు

ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి