గుంటూరు: అమరావతి టౌన్‌షిప్ సమీపంలో  అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన జ్యోతి మృతదేహనికి గురువారం నాడు రీ పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం విషయమై జ్యోతి కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో  మరోసారి జ్యోతి మృతదేహనికి రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.

ఈ నెల 11వ తేదీ రాత్రి జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడు శ్రీనివాస్‌తో జ్యోతి కలిసి ఉన్న సమయంలో  గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో  జ్యోతి మృత్యువాత పడినట్టుగా చెబుతున్నారు. అయితే జ్యోతి కుటుంబసభ్యులు మాత్రం ప్రియుడు శ్రీనివాస్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జ్యోతి పోస్ట్‌మార్టం పూర్తి చేసిన ఆమె దుస్తులను పోలీసులు సేకరించలేదు. అయితే ఈ దుస్తులను సేకరించేందుకు బుధవారం నాడు ఉదయం జ్యోతి సోదరుడు ప్రభాకర్‌కు సమాచారమిచ్చి మృతదేహం నుండి దుస్తులను పోలీసులను తీసుకొన్నారు.

జ్యోతి పోస్ట్‌మార్టం‌పై పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం నాడు మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో గురువారం నాడు  జ్యోతి మృతదేహనికి పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని ప్రోఫెసర్ కేకే రెడ్డి ఆథ్వర్యంలో  జ్యోతి మృతదేహనికి రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

జ్యోతి హత్య కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు

శ్రీనివాస్ బైక్‌పై జ్యోతి: సీసీటీవీ కెమెరాకు చిక్కిన దృశ్యం

అమరావతి రేప్, హత్య కేసులో సంచలనం: ప్రియుడిపైనే అనుమానాలు

ప్రియుడి ముందే ప్రేయసిపై రేప్: దాడి, యువతి మృతి