అమరావతి: వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్టు కేటాయింపు అనేది సాధ్యం కాకపోవచ్చనేది టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గెలుపు గుర్రాలకే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు టిక్కెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు.

వైసీపీ నుండి టీడీపీలో సుమారు 23 మంది ఎమ్మెల్యేలు చేరారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టీడీపీ టిక్కెట్లు దక్కకపోవచ్చని టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కడప జిల్లాలోని  జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదినారాయణరెడ్డికి మరోసారి టిక్కెట్టు దక్కే అవకాశం లేకపోలేదు. అయితే గతంలో ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడ ఈ స్థానం నుండి పోటీ చేస్తానని పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి  కూడ టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు.

ఎమ్మెల్సీ పదవి ఇచ్చినంత మాత్రాన ఎమ్మెల్యే టిక్కెట్టును వదులుకోమని రామసుబ్బారెడ్డి గతంలోనే తేల్చి చెప్పారు. అయితే ఆదినారాయణరెడ్డికి టిక్కెట్టు ఇచ్చే విషయమై బాబు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. 

మరోవైపు కర్నూల్ జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూమా కుటుంబం నుండి ఇద్దరు బరిలో ఉన్నారు.నంద్యాల నుండి భూమా బ్రహ్మనందరెడ్డి, ఆళ్లగడ్డ నుండి భూమా అఖిలప్రియ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బాబు మంత్రివర్గంలో అఖిలప్రియ టూరిజం మంత్రిగా కొనసాగుతున్నారు.

ఈ దఫా భూమా కుటుంబం నుండి ఒక్కరికే టిక్కెట్టు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. నంద్యాల  సీటు భూమా కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఆళ్లగడ్డ సీటును భూమా అఖిలప్రియకు డౌటేనని అంటున్నారు. కానీ, ఈ ప్రచారాన్ని అఖిలప్రియ వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. అఖిలప్రియ స్థానంలో  ఆ కుటుంబానికి చెందిన వారికి టిక్కెట్‌ను ఇచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ కూడ లేకపోలేదు.

ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డికి ఈ దఫా టిక్కెట్టు కేటాయిస్తారని ప్రచారం కూడ లేకపోలేదు. ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి కూడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా  పోటీగా కార్యక్రమాలను నిర్వహించారు. 

ఈ సమయంలో చంద్రబాబునాయుడు ఏవీ సుబ్బారెడ్డిని  పిలిపించి మాట్లాడారు.ఆళ్లగడ్డ సీటు విషయమై ఏవీ సుబ్బారెడ్డి పట్టుబట్టే అవకాశం లేకపోలేదంటున్నారు. ఏవీ సుబ్బారెడ్డి కారణంగానే భూమా కుటుంబానికి ఒక్క టిక్కెట్టును కేటాయిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే భూమా కుటుంబాన్ని బాబు పక్కనపెట్టకపోవచ్చనే వారు కూడ లేకపోలేదు. 

విజయనగరం జిల్లాలో మంత్రి సుజయకృష్ణరంగారావుకు టిక్కెట్టు కేటాయిస్తారని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఆశోక్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌లకు మరోసారి చంద్రబాబునాయుడు ఛాన్స్ కేటాయించే అవకాశం లేకపోలేదంటున్నారు. గొట్టిపాటి రవికి మరోసారి టిక్కెట్టు కేటాయిస్తే కరణం బలరాం కుటుంబం ఏం చేస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

గొట్టిపాటి రవి నియోజకవర్గంలో జోక్యం చేసుకోకూడదని కరణం బలరాంకు బాబు ఇప్పటికే ఆదేశించారు. అయితే బలరాం కొన్ని సమయాల్లో జోక్యం చేసుకోవడంతో బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో గతంలో కరణం బలరాం, గొట్టిపాటి రవి వర్గీయుల మధ్య గొడవ కూడ చోటు చేసుకొంది.

కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ టిక్కెట్టు దక్కోచ్చని అంటున్నారు.గతంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. దీంతో రాజశేఖర్ రెడ్డికే అడ్డు తొలగిపోయింది. కడప జిల్లా బద్వేలులో జయరాములుకు స్థానిక టీడీపీ నేతలకు మద్య పొసగడం లేదు.

విజయవాడ సిటీలో జలీల్‌ఖాన్ ఈ దఫా పోటీకి దూరంగా ఉండాలని బావిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.  తన స్థానంలో తన కూతురును బరిలోకి దింపాలని జలీల్‌ఖాన్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే జలీల్ ఖాన్ పోటీకి దూరంగా ఉంటే ఆయన కుటుంబానికి టిక్కెట్టు ఇస్తారా.. మరోకరిని బరిలోకి దింపుతారా అనేది తేలాల్సి ఉంది.

పామర్రు నుండి విజయం సాధించిన ఉప్పులేటి కల్పనకు ఈ దఫా టిక్కట్టు ఇస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అనంతపురం జిల్లాలోని కదిరి లో చాంద్ బాషాకు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు మధ్య పొసగడం లేదు.చాంద్‌భాషాకు టిక్కెట్టు ఇవ్వడాన్ని వ్యతిరేకించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

ఈ దఫా పాడేరు నుండి కిడారి శ్రవణ్ కు టిక్కెట్టును కేటాయించనున్నారు.ఏజెన్సీలోని ఇతర ఎమ్మెల్యేలకు కూడ టిక్కెట్ల విషయంలో బాబు ఆచితూచి నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.

గెలుపు గుర్రాలకు మాత్రమే చంద్రబాబునాయుడు టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందంటున్నారు. జనవరిలో బాబు తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత తొలి జాబితాను విడుదల చేసే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు

స్వంత జిల్లాలోనే బాబుకు చుక్కలు చూపుతున్న తెలుగు తమ్ముళ్లు

కేసీఆర్ ఫార్మూలాతో చంద్రబాబు: టీడీపీ తొలి జాబితా రెడీ

ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ యూటర్న్, వైసీపీ సంబరాలు: బాబు ఫైర్

11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ఏపీకి అన్యాయం: కేంద్రంపై బాబు

నాకు కేసీఆర్ బర్త్‌డే గిఫ్ట్, భయపడను: బాబు

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక

శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్