అమరావతి: 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి.. ఏపీకి కేంద్రం  అన్యాయం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.ఏపీకి కక్షగట్టినట్టుగా నిధులు ఇవ్వడం లేదన్నారు. ఏపీని బలిపశువును  చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

ఏపీకి కేంద్రం ఇచ్చిన హమీలపై  ఆదివారం నుండి శ్వేత పత్రాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీలపై  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో  శ్వేత పత్రం విడుదల చేశారు.

ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని  డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో అన్ని పార్టీలు మోడీని నిలదీసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
దుర్మార్గానికి కూడ  హద్దులుంటాయన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలను  ఆ పార్టీ తుంగలో తొక్కిందన్నారు.

ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు గాను నవ నిర్మాణ దీక్షలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.2014 ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని హామీని అమలు చేయలేన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు నిధులుు ఇవ్వడం లేదన్నారు.

ఇతర రాష్ట్రాల్లో విగ్రహాలకు, హై స్పీడ్ రైళ్లకు లక్షల కోట్లలో నిధులను కేటాయించారని, ఏపీకి మాత్రం మొండిచేయి చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంస్థల విభజనకు సంబంధించి ప్రధాన మంత్రి కనీసం రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి ఏనాడూ మాట్లాడలేదన్నారు.142 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒక్కటీ కూడ ఏపీకి రాలేదని బాబు చెప్పారు

సంబంధిత వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ యూటర్న్, వైసీపీ సంబరాలు: బాబు ఫైర్

11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ఏపీకి అన్యాయం: కేంద్రంపై బాబు

నాకు కేసీఆర్ బర్త్‌డే గిఫ్ట్, భయపడను: బాబు

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక

శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్