అమరావతి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు  ఇప్పట్లో లేదని కేంద్రం ప్రకటించింది.2026 వరకు నియోజకవర్గాల పెంపు ఉండబోదని కేంద్రం తేల్చేసింది. ఈ పరిణామం టీడీపీకి ఇబ్బంది కల్గించే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2014 ఎన్నికల్లో  టీడీపీ ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.  ఆ ఎన్నికల్లో టీడీపీ 103 స్థానాల్లో విజయం సాధించింది.  వైసీపీకి 66 స్థానాలు దక్కాయి. అయితే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వీరిలో  ముగ్గురికి మంత్రి పదవులు కూడ దక్కాయి. 

అయితే ఇతర పార్టీలను  టీడీపీలో చేర్చుకొన్న చంద్రబాబునాయుడుకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. వైసీపీ నుండి  వచ్చిన నేతలు, ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో  టిక్కెట్ల కేటాయింపు సమస్యగా మారనుంది.

ఏపీ పునర్విభజన చట్టం మేరకు  రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు చేసుకొనే వెసులుబాటును కల్పించింది. ఈ చట్టంలోని  ఓ సెక్షన్ ను సవరిస్తే  రెండు రాష్ట్రాల్లో  అసెంబ్లీ సీట్లను పెంచుకొనే అవకాశం ఉంది.

కానీ,నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని  కేంద్రం తాజాగా ప్రకటించింది.  మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇటీవల  వేసిన ప్రశ్నకు కేంద్రం ఇప్పట్లో  ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో  అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు 2026 వరకు ఉండదని తేల్చారు.

అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు లేకపోవడం అధికార టీడీపీకి ఇబ్బందికర పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర పార్టీల నుండి వచ్చినవారితో  పాటు మొదటి నుండి పార్టీలో ఉన్న వారు టిక్కెట్ల  విషయంలో పోటీ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో టిక్కెట్ల కేటాయింపు  టీడీపీ చీఫ్ కు ఇబ్బందికరమే.

సంబంధిత వార్తలు

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే