MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం... 48 గంటల్లో ఈ 28 తెలుగు జిల్లాల్లో వర్షబీభత్సమే

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం... 48 గంటల్లో ఈ 28 తెలుగు జిల్లాల్లో వర్షబీభత్సమే

Andhra Pradesh Weather Update :  ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే నాలుగు రోజులు వర్షబీభత్సమే… కొన్నిచోట్ల ఏకంగా 15 నుండి 65 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరిస్తోంది.  

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 20 2026, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Image Credit : Pixabay

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Andhra Pradesh Weather Update : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలను కురిపించబోతున్నాయి. ఇప్పటికే సముద్రంలో ఓ అల్పపీడనం కొనసాగుతోంది... ఇప్పుడు ఇంకోటి కూడా సిద్దమవుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వచ్చే నాలుగు రోజులు వర్షాలే
Image Credit : Asianet News

వచ్చే నాలుగు రోజులు వర్షాలే

బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలుతూ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రేపు (ఫిబ్రవరి 21) శనివారం నుండి వరుసగా నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ఒకటిరెండు జిల్లాల్లో కాదు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని... అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు సంస్థ వెల్లడించింది. ఏరోజు ఏఏ జిల్లాల్లో ఏ స్థాయి వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయో కూడా ప్రకటించింది

37
రేపు వర్షాలు కురిసే జిల్లాలివే...
Image Credit : Getty

రేపు వర్షాలు కురిసే జిల్లాలివే...

ఫిబ్రవరి 21న ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇక అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కాస్త ఎక్కువ వర్షపాతమే నమోదవుతుందని హెచ్చరించింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు సంస్థ సూచించింది.

47
ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో జోరువానలు...
Image Credit : Getty

ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో జోరువానలు...

ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే వర్షాలు తర్వాతి మూడు రోజులు అంటే ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో మరింత విస్తరించనున్నాయని APSDMA వెదర్ రిపోర్టు తెలియజేస్తోంది. ఫిబ్రవరి 22 (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయట. ఇక నెల్లూరు, కడప, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొనసాగుతాయని ఏపి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

57
ఫిబ్రవరి 23న ఉత్తరాంధ్రలో జోరువానలు
Image Credit : Getty

ఫిబ్రవరి 23న ఉత్తరాంధ్రలో జోరువానలు

ఫిబ్రవరి 23న అంటే వచ్చే సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షతీవ్రత పెరుగుతుందని APSDMA హెచ్చరించింది. అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలుంటాయట. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఈరోజు పొడి వాతావరణం ఉంటుందని విపత్తు సంస్థ వెల్లడించింది.

67
ఫిబ్రవరి 24న ఈ జిల్లాల్లో వర్షాలు
Image Credit : X/APSDMA

ఫిబ్రవరి 24న ఈ జిల్లాల్లో వర్షాలు

ఫిబ్రవరి 24న అంటే వచ్చే మంగళవారం ఎన్టీఆర్, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.  అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, కృష్ణా,  గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.

77
పిడుగులతో కూడిన వర్షాలు...
Image Credit : X/APSDMA

పిడుగులతో కూడిన వర్షాలు...

వేసవికాలంలో కురిసే వర్షాలు పిడుగులు, ఈదురుగాలులను మోసుకువస్తాయి... అంటే ఇవి చాలా ప్రమాదకరం అన్నమాట. కాబట్టి వర్షాలు కురిసే ఈ నాలుగైదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.... ముఖ్యంగా వ్యవసాయ పనులు చేపట్టే రైతులు, కూలీలు వర్ష సమయంలో అస్సలు చెట్లకిందకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. ఇక అల్పపీడనాల ప్రభావంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారుతుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. మొత్తానికి ఎండాకాలంలో వర్షాలు కాస్త ప్రమాదకరమే అయినా అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమని కల్పించనున్నాయి... తెలుగు రాష్ట్రాలు చల్లబడనున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Recommended image3
Now Playing
పవన్ రాకతో ఉప్పొంగిన పిఠాపురం | Deputy CM Pawan Kalyan Craze In Pithapuram | Asianet News Telugu
Related Stories
Recommended image1
IMD Rain Alert : ఆల్రెడీ బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం, నేడు ఇంకొకటి రెడీ.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
IMD Rain Alert : ఒకే వారంలో రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved