హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్‌ కీలకంగా వ్యవహరించనుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చీఫ్  టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినందున ఏపీ రాజకీయాల్లో  టీఆర్ఎస్ తలదూర్చబోతోంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ హెచ్చరించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా  ప్రజా కూటమి ఏర్పాటులో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ‌లను కూడగట్టడంలో  టీడీపీ కీలకంగా వ్యవహరించింది. పీపుల్స్ ఫ్రంట్‌ ఏర్పాటులో  టీడీపీ కీలక భూమిక పోషించింది.తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో  బుద్ది చెప్పేందుకు టీఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేయనుంది.

ఏపీలో  టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో  టీఆర్ఎస్‌ వ్యూహత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆ నేపథ్యంలోనే ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన బాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పారు.

ఏపీ ప్రజలు తనను ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారని  కేసీఆర్ చెప్పారు. ఏపీ రాజకీయాల్లో తాను వేలు పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందో  చంద్రబాబునాయుడు చూస్తారని కేసీఆర్ హెచ్చరించారు.

బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబునాయుడుకు రిటర్న్‌ గిఫ్ట్  ఇస్తానని కేసీఆర్ చెప్పారు.దేశంలో చంద్రబాబునాయుడు చప్పల్ లీడర్ అంటూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు పైత్యం ఉందన్నారు. మోడీని  అతిగా పొగిడే క్రమంలో బొక్క బోర్లాపడ్డారనికేసీఆర్ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్