Asianet News TeluguAsianet News Telugu

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

తెలంగాణలో పీపుల్స్ ఫ్రంట్  అధికారంలోకి రాకపోవడంతో  ఏపీలో టీడీపీ నేతలు లోలోపల ఆనందంతో ఉన్నారు

ap tdp leaders happy for people front defeat in telangana elections
Author
Amaravathi, First Published Dec 21, 2018, 12:03 PM IST

అమరావతి: తెలంగాణలో పీపుల్స్ ఫ్రంట్  అధికారంలోకి రాకపోవడంతో  ఏపీలో టీడీపీ నేతలు లోలోపల ఆనందంతో ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఇప్పటికైనా చంద్రబాబునాయుడు పార్టీపై కేంద్రీకరించే అవకాశం ఉందని కొందరు సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ ఫ్రంట్  పేరుతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి 19, టీడీపీకి రెండు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. టీజేఎస్, సీపీఐలకు ఒక్క సీటు కూడ దక్కలేదు.

తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంపై బాబును కేంద్రంగా చేసుకొని టీఆర్ఎస్ చీఫ్ విమర్శలు గుప్పించారు. 

తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి వస్తే ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడ పడే అవకాశం లేకపోలేదు.  అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాలేదు. దీంతో ఇప్పటికైనా ఏపీలో టీడీపీపై చంద్రబాబునాయుడు దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలపై చంద్రబాబునాయుడు ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు.  అధికారులతో నిత్యం సమీక్షలు, టెలికాన్పరెన్స్ లతో బాబు బిజీ బిజీగా ఉంటున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలపై బాబు అంతగా కేంద్రీకరించడం లేదనే  అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏపీలో కూడ ఎన్నికల మూడ్ వచ్చింది. ఫిబ్రవరి లేదా  మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున  పార్టీపై బాబు దృష్టి కేంద్రీకరించే అవకాశం అనివార్యమైంది.

ఎన్నికల షెడ్యూల్ వెలువడే దాని కంటే  అభ్యర్థులను ప్రకటించనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో పార్టీపై చంద్రబాబునాయుడు కేంద్రీకరించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి విజయం సాధిస్తే బాబు పార్టీపై కేంద్రీకరించకపోయేవాడని కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు. 

తెలంగాణలో ప్రజా కూటమి ఓడిపోవడం వల్ల ఏపీలో పార్టీపై బాబు కేంద్రీకరించేందుకు ఛాన్స్ ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఓడిపోవడం ఏపీలో తమకు కలిసి వస్తోందని ఆ పార్టీ నేతలు లోలోపల సంతోషంగా ఉన్నారు.కానీ, పైకి మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నట్టు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

 

Follow Us:
Download App:
  • android
  • ios