అమరావతి: జనవరిలో టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 మంది అభ్యర్థుల జాబితాను సిద్దం చేసుకొన్నారు. సంక్రాంతి తర్వాత సుమారు వంద మందికి తగ్గకుండా అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని టీడీపీ చీఫ్ భావిస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ కంటే కనీసం నెల రోజుల ముందుగానే  అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించకపోతే  గత ఎన్నికల్లో గెలుపు సాధించాల్సిన చోట ఓటమి పొందాల్సి వచ్చిందని బాబు అభిప్రాయంతో ఉన్నారు. గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున జనవరి మాసంలో అభ్యర్థులను ప్రకటించేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత కనీసం 100 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసుకొంటున్నారు. తొలి జాబితాలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాల్లో అభ్యర్థుల జాబితా తొలి జాబితాలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సిట్టింగ్‌ల్లో మార్పులు చేర్పులు కూడ తొలి జాబితాలో ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇప్పటికే 50 మంది అభ్యర్థుల జాబితాను బాబు సిద్దం చేశారు. సర్వే ఆధారంగా అభ్యర్థుల జాబితాను బాబు ప్రకటించనున్నారు.

వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు చంద్రబాబుకు ఉన్నాయి.దీంతో గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయించాలని ఆయన భావిస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉన్న వారికే టిక్కెట్లను కేటాయించనున్నారు. తొలి జాబితా తర్వాత విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు.

ముందుగా అభ్యర్థుల ప్రకటన కారణంగా పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేలా బాబు ప్లాన్ చేసుకొంటున్నారు. అభ్యర్థులను మార్చాల్సిన చోట తప్పకుండా వారికి  టిక్కెట్లను నిరాకరించనున్నారు. కానీ, నామినేటేడ్ పదవులు కేటాయించనున్నట్టు బాబు వారికి హామీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

సంబంధిత వార్తలు

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే