టీఆర్ఎస్ పార్టీకి లభించిన విజయం తెలంగాణ ప్రజల విజయంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభిప్రాయపడ్డారు.తాము గెలిస్తే కాళేశ్వరం వస్తోందన్నారు. ప్రజలు కాళేశ్వరం కావాలని తమను గెలిపించారని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి లభించిన విజయం తెలంగాణ ప్రజల విజయంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
సోమవారం నాడు ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.తెలంగాణకు చెందిన సకల జనులు టీఆర్ఎస్‌కు పట్టం కట్టారని చెప్పారు. టీఆర్ఎస్‌కు పట్టం కట్టిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.మూడు మాసాలకు పైగా టీఆర్ఎస్ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేశారని చెప్పారు.
ఈ ఎన్నికల్లో కాళేశ్వరం కావాలో.. శనేశ్వరం కావాలో తేల్చుకోవాలని తాను ప్రజలను కోరారని చెప్పారు. కూటమి గెలిస్తే శనేశ్వరం వస్తోందన్నారు. తాము గెలిస్తే కాళేశ్వరం వస్తోందన్నారు. ప్రజలు కాళేశ్వరం కావాలని తమను గెలిపించారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల తీర్పుకు అనుగుణంగా పనిచేయాలని కేసీఆర్ కోరారు.ఈ ఎన్నికల్లో గెలిచామని పొంగిపోవద్దని కార్యకర్తలకు కోరారు. గిరిజన, గిరిజనేతరుల మధ్య ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తొలి ఆరు మాసాల్లోనే ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
తెలంగాణలో కోటి ఎకరాల భూమి పచ్చబడాల్సిన అవసరం ఉందన్నారు.యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. ఉద్యోగ ఖాళీలను వేగంగా భర్తీ చేస్తామన్నారు. ప్రైవేట్ రంగంలో కూడ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
కులవృత్తులు కుదుటపడేలా చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.తెలంగాణ రైతులకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తామన్నారు.దళితులు, గిరిజనుల సమస్యలకు అంతం పలకాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు.విజయమో ఎంత గొప్పగా ఉందో... బాధ్యత కూడ అంత బరువుగా ఉందన్నారు.
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించిన ఈసీకి కేసీఆర్ ధన్వవాదాలు తెలిపారు. కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిర్వహించనుంది.
దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ తనతో మమత బెనర్జీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు మాట్లాడారని ఆయన గుర్తు చేశారుబీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నట్టు కేసీఆర్ చెప్పారు.దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటులో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనున్నట్టు ఆయన చెప్పారు.
కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. తమ పార్టీకి చెందిన కొందరు నేతల పొరపాట్ల వల్ల సుమారు పదికి పైగా సీట్లను కోల్పోయినట్టు చెప్పారు.ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి తన మద్దతు పలికారు.మైనార్టీల సమస్యలపై చర్చించినట్టు చెప్పారు.దేశంలో మైనార్టీల సంక్షేమం కోసం అసద్‌తో చర్చించినట్టు చెప్పారు.రొటీన్ రాజకీయాలకు భిన్నంగా దేశ రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి చూపుతామన్నారు.
భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పును చూస్తారని కేసీఆర్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ నుండి విముక్తి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏం చేయబోతున్నామనేది చూస్తామన్నారు.రేపు పదకొండున్నర గంటలకు టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 11, 2018, 5:18 PM IST