MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Pawan Kalyan : మాట తప్పని జనసేనాని.. ఆ గ్రామం దశ మారిపోయింది !

Pawan Kalyan : మాట తప్పని జనసేనాని.. ఆ గ్రామం దశ మారిపోయింది !

Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్న కొణిదెల గ్రామంలో రూ. 6 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. సొంత నిధులు రూ. 50 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ త్వరలో ప్రారంభం కానుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 21 2026, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ అడ్డాలో అభివృద్ధి జాతర
Image Credit : X/Pawan Kalyan

పవన్ కళ్యాణ్ అడ్డాలో అభివృద్ధి జాతర

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నంద్యాల జిల్లాలోని కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నందికొట్కూరు మండల పరిధిలోకి వచ్చే ఈ గ్రామం, ఉపముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఇప్పుడు మహర్దశను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ ఈ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించడమే కాకుండా, తన సొంత విరాళంతో కీలక సమస్యలను పరిష్కరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సొంత నిధులతో తాగునీటి కష్టాలకు చెక్
Image Credit : X/Pawan Kalyan

సొంత నిధులతో తాగునీటి కష్టాలకు చెక్

కొణిదెల గ్రామ ప్రజల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని తీర్చడానికి పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి రూ. 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. గతంలో ఆయన ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను విడుదల చేశారు. జిల్లా అధికారుల సూచనలతో, ఈ రూ. 50 లక్షల వ్యయంతో గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యం కలిగిన రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ట్యాంక్ ద్వారా సుమారు 2 వేల మంది గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. వేసవి కాలం ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తి కావడం పట్ల పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేసిన గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

35
రూ. 6 కోట్లతో గ్రామాభివృద్ధి పనులు
Image Credit : Pawan Kalyan Twitter

రూ. 6 కోట్లతో గ్రామాభివృద్ధి పనులు

కేవలం తాగునీటికే పరిమితం కాకుండా, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులను పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామానికి కేటాయించారు. పల్లెపండగ 1.0 కింద రూ. 20 లక్షలతో మూడు అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పల్లెపండగ 2.0 కింద రూ. 45 లక్షల అంచనా వ్యయంతో మరో ఏడు సి.సి. రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు.

45
మెరుగైన రహదారులు.. మౌలిక వసతులు
Image Credit : Pawan Kalyan Twitter

మెరుగైన రహదారులు.. మౌలిక వసతులు

గ్రామంలోని రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీగా నిధులు వెచ్చించారు. కొణిదెల జిల్లా పరిషత్ స్కూల్ నుండి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బి.టి. రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు మంజూరు చేశారు. అలాగే, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి గ్రామానికి వచ్చే రహదారి పునరుద్ధరణ కోసం రూ. 45 లక్షలు కేటాయించారు. ప్రజల అభ్యర్థన మేరకు గృహ నిర్మాణ శాఖ సహకారంతో 19 ఇళ్లు, 4 పశువుల షెడ్లు, నీటి తొట్టెలను నిర్మించారు.

55
రైతులకు ప్రాధాన్యం.. సాగునీటి వనరుల పునరుద్ధరణ
Image Credit : Pawan Kalyan Twitter

రైతులకు ప్రాధాన్యం.. సాగునీటి వనరుల పునరుద్ధరణ

రైతు సంక్షేమమే ధ్యేయంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేశారు. వ్యవసాయానికి సాగునీరు అందించేలా రెండు మైనర్ కాలువల పునరుద్ధరణ పనులను పూర్తి చేయడంతో పాటు, మూడు కమ్యూనిటీ చెక్ డ్యామ్స్ మరమ్మతులు కూడా పూర్తయ్యాయి. 2019 ఎన్నికల సమయంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ అక్షరాలా అమలు చేస్తున్నారు. తన ఇంటి పేరుతో ఉన్న గ్రామం కావడంతో, ఆ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Schools Bandh : తీవ్ర వాయుగుండం లోడింగ్, ఇక కుండపోత వర్షాలే... ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
Recommended image2
Now Playing
Chaganti Amazed By The Children Wonderful Performance | Nara Lokesh | Asianet News Telugu
Recommended image3
Now Playing
ఈ ఏజ్ లో బాబుగారు ఎలా కష్టపడుతున్నారో చూడండి | Asianet News Telugu
Related Stories
Recommended image1
Rashmika Mandanna: కాబోయే అత్తతో రష్మిక మందన్నా.. రహస్యంగా ఇంత కథ నడిపించారా? ఫోటోలు వైరల్‌
Recommended image2
Meghana Raj: రెండో పెళ్లిపై తొలిసారిగా ఓపెన్‌ అయిన మేఘన.. జీవితంలో ఒక తోడు కావాలంటూ ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved