చిత్తూరు: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్వంత జిల్లాలో టీడీపీ సభ్యత్వం నమోదులో తెలుగు తమ్ముళ్లు వెనకంజలో ఉన్నారు.  ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదులో  టీడీపీ నేతల తీరుపై  చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొనే దిశగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు బాబు గాలం వేస్తున్నారు.అదే సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా బాబు వ్యూహ రచన చేస్తున్నారు.

కానీ, బాబు ప్లాన్‌కు అనుగుణంగా తెలుగు తమ్ముళ్లు పని చేయడం లేదని బాబు అసంతృప్తితో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో పార్టీ సభ్యత్వ సేకరణలో  తెలుగు తమ్ముళ్ల తీరుపై బాబు సీరియస్ అయ్యారు.

జిల్లాలోని పీలేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే లక్ష్యానికి కంటే ఎక్కువగా  సభ్యత్వం నమోదైంది. పలమనేరు సెగ్మెంట్‌లో 78 శాతం, తంబళ్లపల్లి నియోజకవర్గంలో 55 శాతం మాత్రమే సభ్యత్వం నమోదైంది.

నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు సభ్యత్వ చేర్పింపుకు అవకాశం ఉంది. అయితే నిర్ణీత షెడ్యూల్ ‌లో  కూడ  సభ్యత్వ చేర్పింపులో లక్ష్యాన్ని చేయకపోవడంతో  మరో వారం రోజుల పాటు పొడిగించారు.

పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో పార్టీ నేతలు నిర్లక్ష్యం వహించడంపై  వీడియో కాన్పరెన్స్ లో బాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంస్థాగత పనులను పట్టించుకోకుండా పార్టీలో గ్రూపులను పెంచి పోషిస్తున్న కొందరు నేతలపై బాబు సీరియస్ అయ్యారు. రానున్న రోజుల్లో టిక్కెట్ల కేటాయింపు విషయమై కూడ ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

సంబంధిత వార్తలు

కేసీఆర్ ఫార్మూలాతో చంద్రబాబు: టీడీపీ తొలి జాబితా రెడీ

ఏపీకి ప్రత్యేక హోదాపై టీఆర్ఎస్ యూటర్న్, వైసీపీ సంబరాలు: బాబు ఫైర్

11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ఏపీకి అన్యాయం: కేంద్రంపై బాబు

నాకు కేసీఆర్ బర్త్‌డే గిఫ్ట్, భయపడను: బాబు

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక

శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్