అమరావతి: తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ఏపీకి వస్తే  సంతోషమేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.  దేశ ప్రజలను గందరగోళపర్చేందుకు గాను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పేరుతో కేసీఆర్ టూర్ చేయనున్నారని  ఆయన విమర్శించారు.

శుక్రవారం నాడు అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రానన్న రోజుల్లో  పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు.

కొన్ని రాజకీయపార్టీలు కలిసి ఆడుతున్న గేమ్‌ గురించి ప్రజలకు వివరించాలని  చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు వివరించారు. ఏపీలోని  వైసీపీ, జనసేనతో పాటు కేసీఆర్, అసద్‌లపై బాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో తాను ప్రచారం నిర్వహించినందున  తనకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చేసిన వ్యాఖ్యలను బాబు గుర్తు చేశారు. కేసీఆర్ ఏపీకి వస్తే సంతోషమేనని ఆయన చెప్పారు. ఏ పార్టీ ఏ పార్టీతో  కుమ్మక్కయ్యాయో ప్రజలకు అర్ధమయ్యేలా  వివరించాలని  బాబు తెలిపారు.

దేశంలో ప్రజలను గందరగోళపర్చేందుకు కేసీఆర్ పర్యటిస్తున్నారని బాబు  ఆరోపించారు.  బీజేపీకి అనుకూలమైన ఫ్రంట్‌లు కూడ దేశంలో ఏర్పడే అవకాశం ఉందన్నారు. పరోక్షంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ‌పై బాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఈవీఏంలపై ప్రజల్లో  నమ్మకం పోయిందన్నారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ సందర్భంగా ఓట్లు ఎలా పెరిగాయని బాబు ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయని బాబు అభిప్రాయపడ్డారు. తాము ఎవరికీ ఓటు వేశామో తెలుసుకొనే  హక్కు అందరికీ ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే