వేధించి, హింసించడం వల్ల మనిషి చనిపోతే ఏమనాలంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యపై సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు మాట్లాడారు.

కోడెల కుటుంబసభ్యులను అధికార వైసీపీ నేతలు వేధించారని చంద్రబాబు ఆరోపించారు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగలేదని చెప్పారు. ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్ గా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి మరణం చాలా బాధాకరమని ఆయన అన్నారు. మంచి కుక్కని పిచ్చికుక్క అని చెప్పి ప్రచారం చేసి ఎలా చంపుతారో కోడెలను కూడా అలా చేశారు. 

పాత ఫర్నీచర్ కోసం జీవిత శిక్ష వేసే కేసులు పెడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. లక్షల రూపాయల ఫర్నీచర్ కోసం ఆత్మహత్య చేసుకునేలా చేస్తారా అని ప్రశ్నించారు. కోడోలను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించారని ఆరోపించారు. కోడెల కిరాయి ఇంట్లో ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

కేవలం రెండు నెలల్లో కోడెలపై ఏకంగా 19 కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పు చేసి జీవితం ముగిసిపోతే అర్థం చేసుకోవచ్చని...కానీ ఈ విధంగా బాధపడుతూ చనిపోతే అది క్షమించరాని నేరం అవుతుందన్నారు.పులిలాంటి వ్యక్తి భయపడిపోయేలా చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

read more news

సంబంధిత వార్తలు

కోడెల శివప్రసాద్ సూసైడ్: మెడ బాగంలో తాడు మరకలు

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

కోడెల సూసైడ్: గది సీజ్ చేసిన పోలీసులు

కోడెల మృతి: ఆయన కుమారుడిపై మేనల్లుడి సంచలన ఆరోపణలు

కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..

కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్

నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు