హైదరాబాద్: మా నాన్న చాలా ఒత్తిడిలో ఉన్నారని ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి చెప్పారు.

  ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కోడెల కుటుంబంపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మా నాన్న మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కోడెల కూతురు విజయలక్ష్మి పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గాను  తాను రెడీ అవుతున్నాను.. ఆ సమయంలో నాన్న కింది ఫ్లోర్‌ నుండి తన గదిలోకి వెళ్లినట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు.

అరగంట దాటినా కూడ నాన్న రాకపోవడంతో తాను కూడ పైకి వెళ్లినట్టుగా ఆమె చెప్పారు. తాను పైకి వెళ్లే సమయానికే నాన్న ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్టుగా విజయలక్ష్మి పోలీసులకు వివరించారు.

నాన్నపై నమోదైన కేసులు చోటు చేసుకొంటున్న అవమానాలతో నాన్న తీవ్ర అవమానాలకు గురైనట్టుగా  విజయలక్ష్మి పోలీసులకు వివరించారు. నాన్న ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని విజయలక్ష్మి చెప్పారు.

సంబంధిత వార్తలు

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య: చివరి సారి భార్యతో టిఫిన్ చేసి ఇలా...

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల