Asianet News TeluguAsianet News Telugu

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై  సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. 30 ల్యాప్ టాప్ లను  తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు.

skill devolapment officer complaints against kodela siva prasada rao family
Author
Sattenapalle, First Published Aug 23, 2019, 3:36 PM IST

సత్తెనపల్లి: మాజీ స్పీకర్ , టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై మరో కేసు నమోదైంది. శుక్రవారం నాడు స్కిల్ డెవలప్ మెంట్ అధికారి బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. 30 లాప్‌టాప్ లను కోడెల కుటుంబసభ్యులు తీసుకెళ్లారని ఆయన ఫిర్యాదు చేశారు.

జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు లాప్ ట్యాప్ లు తీసుకొచ్చారు. అయితే ఈ సెంటర్ లో ఉన్న 30 లాప్‌టాప్ లను కోడెల కుటుంబసభ్యులు తీసుకెళ్లారని శుక్రవారం నాడు  స్కిల్ డెవలప్ మెంట్ అధికారి బాజీ బాబు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  కోడెల కుటుంబంపై వరుసగా పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  కోడెల కుటుంబంపై ఫిర్యాదులు చేసిన వారిలో ఇతర పార్టీలకు చెందిన వారితో పాటు స్వంత పార్టీకి చెందినవారు కూడ ఉండడం గమనార్హం.అయితే ఈ 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ ఉన్నాయనే విషయమై పోలీసులు ఆరా తీయనున్నారు.

సంబంధిత వార్తలు

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios