నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

తన కార్యాలయంలో చోరీపై డీఎస్పీకి ఫిర్యాదు చేశానని... చోరీకి వచ్చిన వ్యక్తి అర్జున్ అని.. అతను వైసీపీ ఆఫీస్ ఉద్యోగిగా తెలిపారు. చోరీ ఘటన వెనుక వైసీపీ హస్తముందని కోడెల ఆరోపించారు. 

tdp leader kodela comments on robbery in his office in sattenapalli

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. ప్రతిపక్షనేతలను అధికారపక్షం బతకనివ్వడం లేదని.. అసెంబ్లీ ఫర్నీచర్ గుంటూరులో భద్రంగా ఉందన్నారు.

శాసనసభ ఆవరణలో ఖాళీ లేదంటేనే మా ఆఫీసులో భద్రపరిచామని కోడెల స్పష్టం చేశారు. తన కార్యాలయంలో చోరీపై డీఎస్పీకి ఫిర్యాదు చేశానని... చోరీకి వచ్చిన వ్యక్తి అర్జున్ అని.. అతను వైసీపీ ఆఫీస్ ఉద్యోగిగా తెలిపారు.

చోరీ ఘటన వెనుక వైసీపీ హస్తముందని కోడెల ఆరోపించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఆయన నివాసంలోకి కరెంట్ పనుల కోసమంటూ ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. అనంతరం వారిని వాచ్‌మెన్ అడ్డుకోబోగా.. అతనిని పక్కకునెట్టి కంప్యూటర్లతో పరారయ్యారు.

వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడెలకు సైతం సమాచారం అందించినట్లు ఆయన సిబ్బంది తెలిపారు. చోరికి యత్నించిన వారు గతంలో కోడెల వద్ద పనిచేసిన వారిగా గుర్తించారు.

ఒకరు సత్తెనపల్లి మున్సిపల్ ఉద్యోగి అర్జునుడిగా తెలుస్తోంది. చోరికి గురైన రెండు కంప్యూటర్లలో ఒకదానిని తిరిగి కోడెల కార్యాలయం గోడ వెనుక పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శివప్రసాదరావు స్పీకర్‌గా ఉన్న సమయంలో అర్జునుడు తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు.

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios