Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
Vegetable Prices in Telugu States : వీకెండ్ వచ్చేసింది... కాబట్టి చాలామంది వచ్చే వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి కొంటుంటారు. అందుకే వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ అందిస్తున్నాం.

కూరగాయల ధరలు
Vegetables Price : ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాకాలం ముగిసినా తెలుగు రాష్ట్రాల్లో వానలు కొనసాగుతున్నాయి... దీంతో కూరగాయల సాగు కష్టతరంగా మారింది. వర్షాలకు పంటలు దెబ్బతిని కూరగాయల దిగుబడి తగ్గింది… ఆటోమెటిగ్గా మార్కెట్ లో డిమాండ్ పెరిగి ధరలు కొండెక్కాయి. ఏ కూరగాయ ధర చూసినా కిలో రూ.50 కి అటుఇటుగా ఉంది.
సాధారణంగా ఉద్యోగులు, గృహిణిలకు వీకెండ్ లోనే కూరగాయలు కొనేందుకు సమయం దొరుకుతుంది. అందుకే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో శుక్ర, శని, ఆదివారం మూడ్రోజులు ఎక్కువగా కూరగాయల సంతలు జరుగుతుంటాయి. మీరు కూడా ఇలా ఈ వీకెండ్ లో మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ముందుగా ఏ కూరగాయ ధర ఎంతుందో తెలుసుకొండి. దీనివల్ల సరైన ధరకు కూరగాయలు కొనుగోలు చేసే వీలుంటుంది... డబ్బులు ఆదా అవుతాయి.
టమాటా ధర
గతవారం టమాటా ధరలు భాగా పెరిగాయి... దీంతో ఈ ధరలు ఎక్కడివరకు వెళతాయోనని ప్రజలు కంగారుపడిపోయారు. ఇలా కిలో రూ.50-60 పలికిన టమాటా ధర సగానికి పడిపోయింది... ప్రస్తుతం కిలో రూ.30-35 పలుకుతోంది. ఇలా సామాన్యుడికి దూరం అవుతుందనుకున్న టమాటా మళ్లీ అందుబాటులోకి వచ్చింది.
ఉల్లిపాయల ధర
చాలారోజులుగా ఉల్లిపాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.20-25 కి లభిస్తున్నాయి. వంద రూపాయలకు 5 నుండి 6 కిలోలు వస్తున్నాయి. ఉల్లిపాయల నాణ్యతను బట్టి కాస్తు అటుఇటుగా ధరలు ఉన్నాయి. ఉల్లిపాయలు తొందరగా పాడవవు… ఎక్కువకాలం నిల్వవుంటాయి కాబట్టి ఒకేసారి ఎక్కువమొత్తంలో కొంటే ధర మరింత తగ్గవచ్చు.
మిగతా కూరగాయల ధరలు
చిక్కుడు కిలో రూ.40-45
పచ్చిమిర్చి కిలో రూ.40-50
బీట్ రూట్ కిలో రూ.20-30
ఆలుగడ్డ కిలో రూ.20-25
క్యాప్సికం కిలో రూ.50
కాకరకాయ కిలో రూ.35-40
సొరకాయ కిలో రూ.15-20
బీన్స్ కిలో రూ.45-50
క్యాబేజీ కిలో రూ.20
క్యారెట్ కిలో రూ.50-60
వంకాయలు కిలో రూ.20-30
బెండకాయలు కిలో రూ.50-60
బీరకాయ కిలో రూ. 40
దొండకాయ కిలో రూ.30-35
ఆకుకూరల ధరలు
పాలకూర కిలో రూ.17-20
పూదీనా రూ.5-10 కట్ట
కరివేపాకు రూ.5-10 కట్ట (కిలో రూ.80)
కొత్తిమీర రూ.20 కట్ట,
మెంతి కూర కిలో రూ.20
చామకూర కిలో రూ.20 లభిస్తున్నాయి.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

