MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?

Scrub Typhus : కరోనా మాదిరిగానే ఓ ప్రాణాంతక వ్యాధి తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఏమిటీ వ్యాధి, దీని లక్షణాలేంటి, నివారణ మార్గాలేంటి? అనేది తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Dec 05 2025, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంతచిన్న కీటకం మనిషి ప్రాణాలు తీస్తుందా..!
Image Credit : Getty

ఇంతచిన్న కీటకం మనిషి ప్రాణాలు తీస్తుందా..!

Scrub Typhus : ఓ చిన్న కీటకమది.. చీమలు, దోమల మాదిరిగా ఇళ్లలో, పరిసరాల్లోనే ఉంటుంది. కానీ ఇది కుట్టిందా అంతే సంగతి... ప్రాణాంతకమైన బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీసి చివరకు ప్రాణాలు తీస్తుంది. ఇలా మన చుట్టుపక్కల కంటికి కనపడకుండా ఉండే కీటకం ద్వారా సోకే 'స్క్రబ్ టైపస్' బారినపడి తెలుగు ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

25
స్క్రబ్ టైపస్ లక్షణాలు
Image Credit : Getty

స్క్రబ్ టైపస్ లక్షణాలు

ఈ వ్యాధి ఇళ్లు, పొలాల్లో ఉండే చిగ్గర్ మైట్ అనే చిన్న కీటకం ద్వారా వ్యాపిస్తుంది. తదేకంగా పరిశీలిస్తేగానీ ఈ కీటకం కంటికి కనిపించడదు.. ఇది కుడితే దానిలోని ఓరియెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి చేరుతుంది. ఇది కుట్టినచోట శరీరం నల్లగా కాలినట్లు మారిపోతుంది... దద్దుర్లు వచ్చి దురద పెడుతుంది. ఇక శరీరంలోకి చేరిన బ్యాక్టీరియా మెళ్లిగా ఆరోగ్యాన్ని దెబ్బతీసి చివరకు ప్రాణాలు తీస్తుంది.

ఈ స్క్రబ్ టైపస్ బారిన పడ్డవారిలో మొదట శరీరం నీరసంగా మారిపోతుంది... ఏ పని చేయలేకపోతారు. తర్వాత చలిజ్వరం, తల, ఒళ్లనొప్పులు మొదలవుతాయి. అలాగే జీర్ణ, శ్వాస సమస్యలు వస్తాయి. శరీరంలోని ఒక్కో అవయవం బ్యాక్టీరియా ప్రభావంతో దెబ్బతిని మనిషి కోమాలోని వెళ్లే అవకాశాలుంటాయి... చివరకు ప్రాణాలు పోవచ్చు.

Related Articles

Related image1
తిలక్ వర్మకు ప్రాణాంతక వ్యాధి.. ఏమిటీ 'రాబ్డోమయోసిస్'? దీని లక్షణాలేంటి?
Related image2
Health : పాప్ కార్న్ తింటే ప్రాణాంతక లంగ్స్ వ్యాధి.. మీ పిల్లలు అడిగారని తినిపించారో అంతే సంగతి..!
35
స్క్రబ్ టైపస్ నివారణ మార్గాలు
Image Credit : gemini

స్క్రబ్ టైపస్ నివారణ మార్గాలు

1. ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు, ఈగలు వంటివి ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలి. ఇలా చేశారంటే స్క్రబ్ టైపస్ వ్యాధికారక కీటకం కూడా ఇంట్లోకి చేరదు.

2. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ ను వ్యాప్తిచేసే కీటకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పశువులు, ఇతర జీవాలుండే ప్రాంతాలు, పొలాలు, గడ్డివాముల వద్ద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు, రైతు కూలీలు ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి.

3. పిల్లల్లో ఈ స్క్రబ్ టైపస్ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారి శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే దుస్తులు వేయాలి. అలాగే పిల్లలు నిద్రించే సమయంలో ఎలాంటి కీటకాలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

4. పట్టణాల్లో ఇంటి ఆవరణలోనే మొక్కలు పెంచుతుంటాయి... ఇలాంటి ఇళ్లలో కుండీల చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే అపరిశుభ్ర వాతావరణ ఏర్పడి కీటకాలు పెరుగుతాయి.

5. నదులు, వాగులు వంకలు, చెరువులు వంటి నీటిప్రవాహాల తీరప్రాంతాల్లో ఈ చిగ్గర్ మైట్ కీటకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

45
స్క్రబ్ టైపస్ కు చికిత్స
Image Credit : stockPhoto

స్క్రబ్ టైపస్ కు చికిత్స

స్క్రబ్ టైపస్ వ్యాధి బారిన పడ్డవారికి వీలైనంత తొందరగా వైద్యం అవసరం. లేదంటే మెళ్లిగా ప్రారంభమయ్యే అనారోగ్యం చివరకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి కారణం అవుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఒకేసారి చుట్టిముట్టి ప్రాణాంతకంగా మారవచ్చు. ముందుగానే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది.

స్క్రబ్ టైపస్ వ్యాధిని గుర్తించేందుకు ర్యాడిప్, వైల్ ఫెలిక్స్, ఐజీఎం ఎలీసా వంటి టెస్టులు చేస్తారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని హాస్పిటల్స్ లో వ్యాధి నిర్దారణ టెస్టులు అందుబాటులో ఉంటాయి. స్క్రబ్ టైపస్ బారిన పడ్డవారు వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స పొందాలి.. లేదంటే ఇది ప్రాణాంతకంగా మారుతుంది.

55
ఏపీలో స్క్రబ్ టైపస్ మరణాలు
Image Credit : stockPhoto

ఏపీలో స్క్రబ్ టైపస్ మరణాలు

స్క్రబ్ టైపస్ అనేది అంటువ్యాధి కాదు... ఒకరి నుండి ఒకరికి సోకదు. కేవలం ప్రత్యేక కీటకం ద్వారానే ఇది వ్యాప్తి చెందుతుంది. దీని బారినపడి ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ఐదుగురు మరణించారు. పల్నాడులో జ్యోతి, నాగమ్మ... విజయనగరంలో రాజేశ్వరి... బాపట్లలో మస్తాన్ బి... నెల్లూరులో సంతోషి మరణించారు.

తెలంగాణలో కూడా కొందరు చిన్నారులు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అనంతరం వీళ్లు కోలుకున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాలను స్క్రబ్ టైపస్ వ్యాధి వణికిస్తోంది... ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఆరోగ్యం
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
చిన్నారుల సంరక్షణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Sajjala Ramakrishna REddy Pressmeet: మీ ఆటలు సాగవు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్| Asianet News Telugu
Recommended image2
Now Playing
Chief Justice of India Justice Surya Kant Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ సూర్యకాంత్
Recommended image3
Now Playing
Bhumana Karunakar Reddy Comments on BR Naidu: బీఆర్ నాయుడుపై భూమన సెటైర్లు| Asianet News Telugu
Related Stories
Recommended image1
తిలక్ వర్మకు ప్రాణాంతక వ్యాధి.. ఏమిటీ 'రాబ్డోమయోసిస్'? దీని లక్షణాలేంటి?
Recommended image2
Health : పాప్ కార్న్ తింటే ప్రాణాంతక లంగ్స్ వ్యాధి.. మీ పిల్లలు అడిగారని తినిపించారో అంతే సంగతి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved