మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శుక్రవారం అరకులో సివేరి సోమ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విశాఖపట్నం: మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శుక్రవారం అరకులో సివేరి సోమ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుని ఓదార్చారు. తానున్నానంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సివేరి సోమ ఎంతో కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. నిరంతరం గిరిజన సంక్షేమమే ధ్యేయంగా సోమ పనిచేశారని తెలిపారు. అరకు అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు. కనీసం ఇళ్లు కూడా నిర్మించుకోకుండా ప్రజా సేవ చేసిన అజాతశత్రువు సోమ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏజెన్సీలో పేదరికాన్ని నిర్మూలించేందుకు సోమ ప్రయత్నించారని తెలిపారు.
సివేరి కుటుంబం ఇంకా స్థిరపడలేదన్నారు. ఎవరైతే సివేరిని హతమార్చారో వారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. సమాజంలో హింసకు తావులేదన్న చంద్రబాబు మావోయిస్టుల చర్యను ఖండించారు. అలాంటి వ్యక్తులను మావోయిస్టులు కాల్చి చంపడం బాధాకరమన్నారు.
మరోవైపు సివేరి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సివేరి కుటుంబ సభ్యులకు విశాఖపట్నంలో ఇంటి స్థలంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అటు పార్టీ తరపున కూడా సివేరి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సివేరి కుటుంబ రాజకీయ భవిష్యత్ పార్టీ చూసుకుంటుందని తెలిపారు.
సంబంధిత వార్తలు
అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం
బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వం: అరకు ఘటనపై బాబు
అరకు ఘటన: కిడారికి బాబు నివాళులు
అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....
కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?
‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు
అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?
అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....
ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?
కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం
అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే
కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర
కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే
అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?
కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...
మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్
బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా
15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు
నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు
నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య
అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)
తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య
మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....
పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....
వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి
గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ
మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)
ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం
