తన ముగ్గురు పిల్లలతో పాటు తనను కూడ బిడ్డ మాదిరిగానే తన భర్త చూసుకొనేవాడని అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు సతీమణి  భార్య చెప్పారు. 


అరకు: తన ముగ్గురు పిల్లలతో పాటు తనను కూడ బిడ్డ మాదిరిగానే తన భర్త చూసుకొనేవాడని అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు సతీమణి భార్య చెప్పారు. ఆదివారం నాడు మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను కాల్చిచంపారు.

అయితే ఈ విషయాన్ని ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కారు డ్రైవర్ .. సర్వేశ్వరరావు భార్యకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. మావోయిస్టులు సర్వేశ్వరరావుతో పాటు, మాజీ ఎమ్మెల్యే సివిరిసోమను కాల్చి చంపారని ఫోన్ చేసి చంపాడు. ఆ సమయంలో ఆమె విశాఖలో ఉంది.

మావోయిస్టుల నుండి బెదిరింపులు వచ్చిన విషయాన్ని తన భర్త ఏనాడూ కూడ తన దృష్టికి తీసుకురాలేదన్నారు. సర్వేశ్వరరావు వద్ద పనిచేసే గన్‌మెన్లు కానీ, ఎస్పీ కూడ ఈ విషయమై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. అయితే తన ముగ్గురు పిల్లలు విశాఖకు వస్తున్నట్టు ఆమె చెప్పారు.

ఢిల్లీలో ఉన్న కొడుకు, విజయవాడలో ఉన్న ఇద్దరు పిల్లలు విశాఖకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. ఇదిలా ఉంటే సర్వేశ్వరరావు సతీమణి సెరికల్చర్ డిపార్ట్ మెంట్ లో జేడీగా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే